బర్డ్ ఫ్లూ హెచ్10ఎన్3(H10N3) స్ట్రెయిన్ ప్రపంచంలోనే తొలిసారి మనిషిలో వెలుగుచూసింది. అది కూడా చైనాలోనే బయటపడింది.
ఝెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తిలో మే 28న ఈ స్ట్రెయిన్ బయటపడగా.. అతడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగుందని పేర్కొన్నారు. డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
తక్కువ తీవ్రతే!
ఈ వైరస్‌లో రోగకారక ప్రవృత్తి పరిమితంగా ఉంటుందని, తక్కువ తీవ్రతే కలిగిస్తుందని అధికారులు తెలిపారు. సాధారణంగా కోళ్ల ఫారాల్లో కనిపించే ఈ స్ట్రెయిన్ తక్కువగానే విస్తరిస్తుందని వివరించారు. కరోనా తరహాలో ఇది మహమ్మారిగా మారే అవకాశాన్ని కొట్టిపారేశారు.
అయితే బర్డ్‌ఫ్లూలో గతంలో వెలుగుచూసిన H7N9 స్ట్రెయిన్ మాత్రం 2016-17 మధ్య దాదాపు 300 మందిని బలి తీసుకుంది.
ఇదీ చదవండి- వేలంలో లక్షలు పలికిన చేప- ఎందుకంత డిమాండ్?