ETV Bharat / international

కరోనాపై చైనా విజయం.. కొత్త కేసులు తగ్గుముఖం - Coronavirus latest

చైనాలో కరోనా వైరస్​ శాంతిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 64,111 మంది ఈ వైరస్​ నుంచి కోలుకోగా.. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా 7 కరోనా మృతులు, కేవలం 8 కేసులు నమోదయ్యాయి.

China reports 7 more deaths, 8 new cases as coronavirus continues to decline
చైనాను కనికరిస్తున్న కరోనా.. తగ్గుతున్న కొత్త కేసులు
author img

By

Published : Mar 13, 2020, 12:59 PM IST

చైనాలో పుట్టిన కరోనాపై ఆ దేశం విజయం సాధించినట్లు కనిపిస్తోంది. వుహాన్​ సహా పలు ప్రాంతాల్లో నెమ్మదిగా వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 7 మృతులు, కేవలం 8 కేసులు నమోదవ్వడం ఆ దేశానికి కాస్త ఊరట కలిగిస్తోంది.

చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(సీఎన్​హెచ్​సీ ) తెలిపిన వివరాల ప్రకారం తాజాగా కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురిలో ఒక్కరు మాత్రమే షాండాంగ్​ ప్రావిన్స్​కు చెందినవారు. వుహాన్​లోనే ఆరుగురికి వైరస్​కు బలయ్యారు. కొత్తగా నమోదైన 8 కేసులు మెయిన్​లాండ్​కు చెందినవి.

జయించినట్టేనా...

ప్రస్తుతం చైనావ్యాప్తంగా 80, 813 కరోనా కేసులుంటే అందులో 64,111 మంది కోలుకున్నారు. అయితే, ఇప్పటికీ చికిత్స పొందుతున్న 13,526 మందిలో 4020 మంది పరిస్థితి విషమంగా ఉంది. మిగిలినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

గురువారం ఒక్కరోజే 1,318 మంది వైరస్​ను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్​ అవడం కొవిడ్-19 వ్యాప్తిలో తగ్గుదలను సూచిస్తోంది. ఈ వివరాలతో కరోనా వ్యాప్తి నియంత్రణలో చైనా కొంతమేర విజయం సాధించిందని పేర్కొంది సీఎన్​హెచ్​సీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కరోనాను మహమ్మారిగా ప్రకటించిన ఒక్కరోజు వ్యవధిలోనే సీఎన్​హెచ్​సీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: వుహాన్​లో 75 వేల మందికి సోకిన కరోనా వైరస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.