ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ! - pakisthan corona cases

చైైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని బీజింగ్​ను ఆనుకొని ఉన్న హెబీ రాష్ట్రంలో కొత్తగా 40 కేసులు వెలుగుచుశాయి. అక్కడ మొత్తం 380 మంది వైరస్ బారిన పడటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. పాకిస్థాన్​లోనూ వైైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కెనడా క్యూబెక్​లో కర్ఫ్యూ విధించారు.

China reports 380 cases south of Beijing
చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
author img

By

Published : Jan 10, 2021, 6:40 PM IST

చైనాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం అక్కడి అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా 69మందికి పాజిటివ్​గా తేలింది. ఇందులో 40 కేసులు రాజధాని బీజింగ్​ను ఆనుకొని ఉన్న హెబీ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అక్కడ ఇప్పటివరకు 380మందికి పైగా వైరస్ బారిన పడినట్లు చైనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా బీజింగ్​కు రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది.

రాజధాని బీజింగ్​లో కొత్తగా ఒక్కరికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అక్కడ మూడు వారాల క్రితం స్వల్పంగా కేసులు నమోదయ్యాయని, మొత్తం కేసుల సంఖ్య 32గా ఉందని పేర్కొన్నారు.

పాక్​లో 5 లక్షలు..

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం కొత్తగా 2,899మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 10వేల 664 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2,278 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

కెనడాలో కర్ఫ్యూ..

కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతన్న నేపథ్యంలో కెనడా క్యూబెక్​ నగరంలో కర్ఫ్యూ విధించారు అధికారులు. 84 లక్షల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలిపారు. అందుకే సమూహాలు ఏర్పడకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. వచ్చే నాలుగు వారాలు రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఎవరైనా రోడ్లపై కనిపిస్తే 6వేల డాలర్ల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: పోప్​కు వచ్చేవారం టీకా- నేతన్యాహుకు రెండో డోసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.