ETV Bharat / international

చైనాలో అంధకారం.. గంటల పాటు కరెంటు కోతలు - చైనా కరెంటు కోతలు

విద్యుత్ సంక్షోభంతో చైనా (China power crisis) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనేక రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు ఈ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. (Blackout in China 2021) కొన్ని రాష్ట్రాలు రోజుకు 9 గంటలకు పైగా విద్యుత్ కోతలను అమలు చేస్తున్నాయి. (China power crunch)

CHINA POWER CRUNCH
చైనా విద్యుత్ సంక్షోభం
author img

By

Published : Sep 29, 2021, 4:12 PM IST

చైనాలో విద్యుత్‌ సంక్షోభం (China power crisis) తలెత్తింది. కొన్ని రాష్ట్రాలు రోజుకు 9 గంటలకుపైగా విద్యుత్‌ కోతలను అమలు చేస్తున్నాయి. షెన్యాంగ్‌లో వినియోగదారులు రెస్టారెంట్లలో సెల్‌ఫోన్‌ వెలుగులోనే ఆహార పదార్థాలను తినాల్సి వస్తోంది. సూపర్‌ మార్కెట్లు కూడా విద్యుత్‌ కోతల (China power crunch) కారణంగా జనరేటర్లతో నడుస్తున్నాయి.

చైనాలో విద్యుత్ కొరతకు (China power cuts) చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ ఆంక్షల అనంతరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యం పుంజుకోగా.. చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి పెరిగింది. విద్యుత్తుకు ఒక్కసారిగా గిరాకీ పుంజుకుంది. 2020తో పోలిస్తే 2021లో విద్యుత్తు వినియోగం 13 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పత్తి (China restrict electricity) లేకపోవడం వల్ల కోతలు తప్పడం లేదు. (China power shortage 2021)

చైనాలో ఎక్కువ శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ఆధారంగానే జరుగుతోంది. 2060 నాటికి కర్బన రహిత దేశంగా మారాలన్న లక్ష్యంతో షీ జిన్‌పింగ్‌ సర్కారు అనేక నిబంధనలను రూపొందించింది. వీటివల్ల బొగ్గు కొరత తలెత్తి సమస్యను మరింత తీవ్రం చేసింది. వివిధ రాష్ట్రాలు కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం విద్యుదుత్పత్తిపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇది కూడా విద్యుత్తు కోతలకు దారి తీస్తోంది.

జల విద్యుత్ కూడా..

ఈ ఏడాది జలవిద్యుదుత్పత్తి కూడా చైనాలో రెండేళ్ల కనిష్ఠానికి పడిపోవడం ప్రతికూలంగా మారింది. విద్యుదుత్పత్తిలో జల, పవన, సౌర వనరుల వాటా పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. 2025 నాటికి 20 శాతం విద్యుత్తు డిమాండ్‌ను ఈ వనరులతో తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల జల విద్యుదుత్పత్తి తగ్గిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పవన విద్యుత్తు కేంద్రాల్లోనూ ఉత్పత్తి పడిపోయింది.

చైనాలో విద్యుత్‌ కోతల పరిస్థితి ఇలాగే కొనసాగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగానూ ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విద్యుత్‌ కొరత కారణంగా కొన్ని కంపెనీలు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశాయి. స్మార్ట్‌ఫోన్లు సహా ఇతర వస్తువుల ఉత్పత్తిలో అవాంతరాలు ఎదురై అది అంతర్జాతీయ సరఫరా గొలుసుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.