ETV Bharat / international

గల్వాన్ ఘటనలో చైనా పథకం బెడిసికొట్టి..! - india china border news

చైనా పక్కా వ్యూహంతోనే గల్వాన్​ లోయలో దుశ్చర్యకు పాల్పడినట్లు అమెరికా ఇంటెలిజెన్స్​ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏ దురుద్దేశంతో కుయుక్తులు పన్ని ఇంతటి ఘాతుకానికి పాల్పడిందో అవన్నీ బెడిసికొట్టాయని వెల్లడించాయి. ఈ చర్యల వెనుక ఓ చైనా అధికారి వ్యూహం ఉందని.. మే నెల చివరి నుంచే ఇందుకోసం సన్నాహాలు మొదలు పెట్టినట్లు పేర్కొన్నాయి.

China Ordered Attack on Indian Troops in Galwan River Valley
గల్వాన్ ఘటనలో చైనా పథకం బెడిసికొట్టి..!
author img

By

Published : Jun 23, 2020, 1:25 PM IST

గల్వాన్‌ లోయలో జరిగిన ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగింది. చైనా దళాలు మన భూభాగంలోకి చొచ్చుకురావడం.. ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లు నటించడం.. భారత దళాలను రెచ్చగొట్టేలా దాడి చేయడం.. వెనుక ఓ చైనా సీనియర్‌ అధికారి వ్యూహం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి చేజారే దశకు చేరిందని వారు విశ్లేషిస్తున్నారు.

చైనా బలప్రదర్శనకు..

చైనా పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ హెడ్‌ జనరల్‌ ఝావో ఝాంగ్‌కీ భారత్‌ సరిహద్దుల వెంట చైనా దళాలు ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం. ఆయన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో సీనియర్‌ కమాండర్‌. ప్రస్తుతం కరోనావైరస్‌ వ్యాప్తి, చైనా దూకుడు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చైనా వ్యతిరేక వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితిని అమెరికా వినియోగించుకొని భారత్‌ను తన పక్షాన చేర్చుకుంటుందని ఆయన అంచనావేశారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఓ గట్టి గుణపాఠం చెప్పి ప్రపంచ వ్యాప్తంగా తాను బలంగా ఉన్నట్లు నిరూపించుకోవాలని చైనా భావించింది. కానీ, గల్వాన్‌లో అది కాస్త బెడిసికొట్టింది. 20 మంది సైనికులు చనిపోయాక భారత్‌ దళాలు అనుకోని రీతిలో ఎదురుదాడి చేసిన కారణంగా భారీ సంఖ్యలో చైనా పరువు పోయే పరిస్థితి నెలకొంది. తాజాగా అక్కడి చైనా కమాండర్‌ కూడా ప్రాణాలు కోల్పోయి పరిస్థితి మొత్తం చేజారిపోయే ప్రమాదం నెలకొంది. మరోపక్క చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కి కూడా ఈ ఘటనపై ముందస్తు సమాచారం ఉందనే అమెరికా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఆయన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ ఛైర్మన్‌ కావటం వల్ల థియేటర్‌ కమాండ్‌ హెడ్‌ తీసుకొనే నిర్ణయం ఆయన దృష్టికి వచ్చే ఉంటుందని చెబుతున్నారు.

ఎవరీ ఝావో..?

కమాండ్‌ స్థాయి అధికారి ఈ ఘర్షణల్లో మృతి చెందినట్లు అమెరికా వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆ సైనికుడి అంత్యక్రియల్లో జనరల్‌ ఝావో కూడా పాల్గొన్నట్లు తెలిసింది. దీంతో చైనా మీడియా సైట్ల నుంచి గల్వాన్‌ వార్తలను తొలగించే పనిలో ఉంది. ఇదే నిజమైతే చైనాకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే భావించాలి. ఇంత పెద్ద ఘటన జరిగినా చైనా మీడియాలో పెద్దగా ప్రచారం రాకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. చైనా సోషల్‌ మీడియాలో దీనిని ఓటమి, అవమానం అంటూ చేస్తున్న పోస్టులను కూడా తొలగిస్తున్నారు.

ఈ వివాదానికి కారణమైన ఝావో చైనా సైన్యంలో చాలా సీనియర్‌ జనరల్‌. ఆయన 1979 వియత్నాం యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడ చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత 2017లో డోక్లాం ఘటనలో ఝావో ప్రమేయం ఉంది.

మే నెల చివరి నుంచే సన్నాహాలు..

భారత్‌ సరిహద్దుల్లో ఘర్షణల కోసం చైనా మే చివరి నుంచే సన్నాహాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రైవేట్‌ జియో ఇంటెలిజెన్స్‌ సంస్థ హాక్‌ఐ 360 ఉపగ్రహ చిత్రాల ప్రకారం మే చివర్లో చైనా సైన్యం భారీ ఆయుధాలతో అక్కడకు చేరుకొంది. వీటిల్లో సెల్ఫ్‌ప్రొపెల్డ్‌ శతఘ్నులు కూడా ఉన్నాయి. అదే సమయంలో భారత్‌ సరిహద్దుల వెంట రోడ్ల నిర్మాణాలను ఆపేయాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది.

ఆర్థిక నష్టానికి కారణం..

గల్వాన్ ఘటనతో భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలా చైనా ప్రాజెక్టులు అగమ్యగోచరంగా మారాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లో చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో డ్రాగన్‌కు కొంత ఆర్థిక నష్టం కూడా చేకూరే పరిస్థితి నెలకొంది. మరోపక్క చైనా ఏ ఉద్దేశంతో భారత్‌ను కవ్వించేందుకు ప్రయత్నించిందో అది నెరవేరలేదు. భారత్‌ అమెరికాకు మరింత దగ్గరయ్యే పరిస్థితి నెలకొంది. అమెరికా కూడా మరోపక్క దూకుడుగా భారత్‌కు మద్దతు ఇస్తోంది. ఇటీవల ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో భారత సైనికులకు నివాళులర్పించారు. ఒక రకంగా ఇది చైనా సైనిక వ్యూహానికి ఏమాత్రం గెలుపుకాదని అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి:కరోనా వల్ల గుండె సమస్యలు తలెత్తుతాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.