చైనా నుంచి భారత్కు(India China Latest News) అతిపెద్ద భద్రతా ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. రావత్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని చైనా రక్షణ విభాగం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు భౌగోళిక, రాజకీయ ఘర్షణను ప్రేరేపించే విధంగా ఉన్నాయని ఆరోపించింది.
"చైనాతో ముప్పు నినాదంతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు దెబ్బతింటున్నాయి. రాజకీయ ఘర్షణనలు రెచ్చగొట్టడం.. ఇరు దేశాలకు ప్రమాదకరం"అని రక్షణశాఖ ప్రతినిధి వూ కియాన్ తెలిపారు. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడం కోసం భారత్ తమకు సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. తద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయన్నారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షతన ఇటీవల 18వ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో రష్యా, చైనా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రూ.50లక్షల కోట్లు దాటిన పాకిస్థాన్ అప్పులు