ETV Bharat / international

రావత్​ హెలికాప్టర్​ ప్రమాదంపై చైనా అవహేళన

China On Rawat Death: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంపై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత కరవని అవహేళన చేసింది.

China
చైనా
author img

By

Published : Dec 11, 2021, 5:34 PM IST

China On Rawat Death: సరిహద్దు దేశం చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం పాలైన నేపథ్యంలో మన సైన్యాన్ని అవహేళన చేస్తూ కారుకూతలు కూసింది. భారత మిలిటరీకి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత కూడా కరవేనని వ్యాఖ్యానించింది. పలువురు సైనిక నిపుణుల అభిప్రాయాలతో ప్రభుత్వరంగ వార్తాసంస్థ 'గ్లోబల్‌ టైమ్స్‌' ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.

భారత బలగాలు ప్రామాణిక నిర్వహణ విధానాలను పాటించరని, వారికి క్రమశిక్షణ లేదని అందులో పేర్కొంది. జనరల్‌ రావత్‌ మృత్యువాతపడ్డ హెలికాప్టర్‌ ప్రమాదం మానవతప్పిదం వల్లే జరిగిందని అభిప్రాయపడింది. గతంలోనూ భారత్‌లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపింది.

వాతావరణం మెరుగుపడేంతవరకు ప్రయాణాన్ని వాయిదా వేసి ఉన్నా, పైలట్‌ మరింత నైపుణ్యవంతంగా నడిపినా, క్షేత్రస్థాయిలోని సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తమిళనాడులో బుధవారం నాటి హెలికాప్టర్‌ ప్రమాదం చోటుచేసుకొని ఉండేది కాదని పేర్కొంది.

ఇదీ చూడండి: CDS Helicopter Crash: ట్రై సర్వీస్ విచారణ అంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.