China omicron first case: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఆందోళనకర ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా కొవిడ్-19 మహమ్మారి పుట్టిన చైనాలోనూ తొలి కేసు నమోదయ్యింది. టియాంజిన్ నగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. ఇప్పటికే డెల్టా ప్రభావంతో వణికిపోతున్న చైనాలో తాజాగా ఒమిక్రాన్ వెలుగు చూడడం కలవరపాటుకు గురిచేసింది.
China covid cases: విదేశాల నుంచి టియాంజిన్‌కు డిసెంబర్ 9 వచ్చిన ఓ వ్యక్తికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. తాజాగా ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్‌గా నిర్ధరణ అయినట్లు చైనా ప్రభుత్వ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఆయనలో ఎటువంటి లక్షణాలూ లేవని, ప్రస్తుతం ఆయన్ను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నామని చైనా అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి: చైనాలో డెల్టా విజృంభణ.. ప్రయాణ ఆంక్షలు కట్టుదిట్టం
Omicron worldwide: మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ ప్రమాదకర వేరియంట్ విస్తృత వేగంతో వ్యాపిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ వేరియంట్ దాదాపు 60 దేశాలకు పైగా వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో బ్రిటన్‌లో ఒమిక్రాన్ వేరియంట్‌తో తొలి మరణం నమోదైంది. ప్రపంచంలో ఈ వేరియంట్‌తో మరణించిన తొలి కేసు కూడా ఇదే.
ఇదీ చూడండి: 'ఒమిక్రాన్‌తో ఆ ఒక్క దేశంలోనే 75వేల మరణాలు!'