'కరోనాను కట్టడి చేసేశాం' అని చైనా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త సమస్య వచ్చి పడింది. విదేశాల నుంచి వివిధ మార్గాల్లో వస్తున్న వారితో మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈశాన్య ప్రాంతంలోని హిలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోకి రష్యా నుంచి వచ్చిన వారిలో మంగళవారం 79 కేసులు నమోదవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.
దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారి ఆచూకీ తెలుసుకుని, ఆరోగ్య పరీక్షలు చేస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని నిర్ణయించారు. సరిహద్దుల్లో ఎంత నిఘా ఉంచినా చొరబాట్లు ఆగడంలేదు. ఈ నేపథ్యంలో అక్రమంగా వచ్చిన వారిని పట్టించినా, ఆచూకీ చెప్పినా 5,000 యువాన్ల(మన కరెన్సీలో రూ.54 వేలు) నగదు ఇస్తామని అధికారులు ప్రకటించారు.