చైనాలో ఏర్పాటుచేసిన 'లార్జ్ హై ఆల్టిటిట్యూడ్ ఎయిర్ షవర్ అబ్జర్వేటరీ' అత్యంత శక్తిమంతమైన గామా కిరణాలను వెదజల్లే 12 మూలాలను గుర్తించింది. 17.5 కోట్ల డాలర్లతో నిర్మిస్తున్న ఈ పరిశీలనశాల సాంకేతికంగా ఇంకా పూర్తికాలేదు. అయినా కీలక ఆవిష్కరణలు చేసిందని చైనా శాస్త్రవేత్త కావో జెన్ తెలిపారు. విశ్వంలో పదార్థం ఏర్పడి, నలుమూలలకూ విస్తరించిన తీరును ఇది వెలుగులోకి తీసుకొస్తుందని భావిస్తున్నారు. వీటిల్లో అన్నింటికంటే ఎక్కువగా ఒక గామా కిరణం మాత్రం.. 1.4 క్వాడ్రాలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తికి సమానమని తమ పరిశోధనల్లో తేల్చారు. నక్షత్రాలు పేలినప్పుడు మాత్రమే కాకుండా.. ప్రకాశిస్తున్న వాటి నుంచి కూడా ఇవి వెలువడుతున్నట్లు గుర్తించారు.
అస్పష్టం కానీ..
ఈ ఆవిష్కరణతో.. ఏ ఆవరణం ఇంత శక్తిమంతమైన కిరణాలతో కాంతిని ఉత్పత్తి చేస్తుందనేది శాస్త్రవేత్తలకు ఇంకా తెలియదు. కానీ.. పాలపుంతలో ఇంతటి శక్తిమంతమైన కిరణాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించొచ్చు. ఇది మరిన్ని పరిశోధనలకు ఆజ్యం పోస్తుంది.
లాసో.. చైనా సిచువాన్ రాష్ట్రంలోని హైజీ మౌంటేన్ ప్రాంతంలో ఉంది. ఇది ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయట్లేదు. ఈ ఏడాది చివర్లోగా అందుబాటులోకి వచ్చి.. మరిన్ని శక్తిమంతమైన కిరణాలను కనుగొంటుందని ఆశిస్తున్నారు.
గామా.. విశ్వంలో అంతర్గత పేలుళ్ల ద్వారా ఉత్పన్నమయ్యే ఒక కిరణం. పెద్ద పెద్ద నక్షత్రాలు పేలినప్పుడు.. అవి గ్రహాలుగా మారతాయి. అక్కడే మనతో పాటు సకల జీవరాశి ఉండొచ్చు. విశ్వంలోని అన్ని విద్యుదయస్కాంత తరంగాల్లో.. గామా కిరణాలకు తక్కువ తరంగ ధైర్ఘ్యం, ఎక్కువ శక్తి ఉంటుంది. ఇవి 10 సెకన్లలో విడుదల చేసే శక్తి.. సూర్యుడు 10 బిలియన్ సంవత్సరాల్లో ఉత్పత్తి చేసే శక్తి కంటే ఎక్కువ.
ఇదీ చూడండి: గాజా ప్రజల కన్నీటి గాథలు- హమాస్ సంబరాలు