ETV Bharat / international

'దొంగ కరోనా' కేసులతో చైనాలో మళ్లీ ఆందోళన

author img

By

Published : Apr 26, 2020, 11:08 AM IST

చైనాలో విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కేసులు క్రమంగా పెరుగుతుండటం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. వీటితోపాటు తిరగతోడుతున్న కేసులు, లక్షణాలు కనిపించని కేసులు విజృంభిస్తుండటం చైనాకు ఇబ్బందేనని ఆ దేశ వైద్యాధికారి తెలిపారు.

VIRUS-CHINA
చైనాలో మళ్లీ ఆందోళన

చైనాపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. విదేశాల వస్తున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా దేశంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి.

చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,827కు చేరింది. వీరిలో 77,394 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4,632 మంది మరణించారు. 10 రోజులుగా ఎవరూ చనిపోయినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్​హెచ్​సీ) నిర్ధరించలేదు.

విదేశాల నుంచి..

చైనాలో శనివారం నమోదైన 11 కేసుల్లో ఐదు విదేశాల నుంచి వచ్చినవారిగా గుర్తించారు అధికారులు. మిగిలిన ఆరు స్థానికంగా సంక్రమించినట్లు నిర్ధరించారు.

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన వుహాన్​లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినా... విదేశాల నుంచి దిగుమతి అవుతున్న కేసులు, లక్షణాలు లేని కరోనాతో వైద్య నిపుణులు మళ్లీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తిరగ తోడుతున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటికీ తీవ్రంగా శ్రమిస్తోందని ఎన్​హెచ్​సీ అధికార ప్రతినిధి మిఫెంగ్ పేర్కొన్నారు.

వెయ్యికి పైగా..

చైనాలో కొత్తగా దొంగ కరోనా (లక్షణాలు కనిపించని) కేసులు 30 నమోదయ్యాయి. ఇందులో ఏడుగురు విదేశాల నుంచి వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మొత్తం ఈ కేసుల సంఖ్య 1,000కి చేరింది. బాధితుల్లో 151 మంది విదేశీయులు.

ఈ కేసుల్లో వ్యక్తిలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. వైరస్​ అతని శరీరంలో ఉంటుంది. అతని నుంచి ఎదుటివారికి సంక్రమించే ప్రమాదముంది.

అమెరికాలో తీవ్రంగా..

అమెరికాలో రోజురోజుకు కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అమెరికాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా పాజిటివ్​ కేసులు 10 లక్షలకు చేరువవగా.. మృతుల సంఖ్య 54 వేలు దాటింది. 1.1 లక్షల మంది కోలుకున్నారు.

ఇదీ చూడండి:కోలుకున్నా గానీ కళ్లల్లోనే కరోనా తిష్ఠ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.