ETV Bharat / international

ఘర్షణకు ముందు చైనా భారీ సైనిక విన్యాసాలు - భారత చైనా తాజా వార్తలు

భారత్​-చైనా సైనికులు ఘర్షణ పడిన ప్రదేశానికి 1200 కి.మీ. దూరంలో చైనా భారీ సైనిక విన్యాసాలు చేసిన వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విన్యాసాలు ఎప్పుడు చేశారో మాత్రం స్పష్టంగా తెలియడంలేదు. చైనాకు చెందిన పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ సీసీటీవీ ఫుటేజ్​ని విడుదల చేసింది.

CHINA MILITARY DRILL
ఘర్షణకు ముందు చైనా భారీ సైనిక విన్యాసాలు
author img

By

Published : Jun 17, 2020, 3:28 PM IST

తూర్పు లద్దాక్​ గాల్వన్ లోయకు సమీపంలో చైనా.. భారీ సైనిక విన్యాసాలు నిర్వహించిన వీడియోలు బయటకొచ్చాయి. భారత్​, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రదేశం నుంచి కేవలం 1200 కి.మీ. దూరంలోనే ఈ విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ యుద్ధ విన్యాసాలు సరిగ్గా ఎప్పుడు చేశారో మాత్రం తెలియడం లేదు.

ఘర్షణకు ముందు చైనా భారీ సైనిక విన్యాసాలు

మూడు వైపులా చుట్టుముట్టినా...

చైనా దేశ పత్రిక గ్లోబల్ టైమ్స్... సైనిక విన్యాసాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ను ప్రసారం చేసింది. ఇందులో నైన్​కెంటాంగ్​లా షాన్​ ప్రాంతంలో 155 మిలిటరీ వాహనాలు ఉపయోగించినట్లు స్పష్టంగా ఉంది. భారీ సంఖ్యలో సైనికులు.. లైవ్ ఫైరింగ్, ఫిరంగుల ప్రయోగ దృశ్యాలు అందులో ఉన్నాయి.

"శత్రు సైనికులు మూడు వైపుల నుంచి దాడి చేసినా ఎదుర్కొనే విధంగా, పరిస్థితులను మా నియంత్రణలోకి తీసుకునేలా వ్యూహాన్ని రచించాం."

- జియాంగ్ జియాలిన్​, టిబెటన్​ మిలిటరీ రీజియన్ బ్రిగేడ్ కమాండర్​

గ్లోబల్​ టైమ్స్ జూన్​ 16న ప్రచురించిన వ్యాసంలో.. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ తన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించింది. సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే చైనా సైనిక దళాలు అప్రమత్తమైనట్లు పేర్కొంది.

సరిహద్దు ఘర్షణ...

తూర్పు లద్దాక్ గాల్వన్ లోయ వద్ద భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో భారత్​ సైనికులు ముగ్గురు వీరమరణం పొందగా.. చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగింది. అయితే ఇరుదేశాల మధ్య నిన్న జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులవ్వగా.. చైనాకు చెందిన 43 మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: చైనాతో వివాదంపై 19న అఖిలపక్ష భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.