ETV Bharat / international

వివాదాన్ని సృష్టించి చర్చలకు రమ్మంటోన్న చైనా! - భారత్ చైనా వివాదం

భారత్​ అధీనంలో ఉన్న గల్వాన్​ లోయపై కొత్త పేచీలు మొదలుపెట్టింది చైనా. సార్వభౌమాధికారం ప్రకటించుకుని తమదేనని వాదిస్తోంది. దశాబ్దాలుగా భారత్​ సైన్యం గల్వాన్​ నదికి ఇరువైపులా గస్తీ నిర్వహిస్తున్న ప్రాంతంపై చైనా వాదన ఆశ్చర్యకరంగా ఉంది. గల్వాన్‌ లోయ విషయంలో చైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూనే.. సమస్య పరిష్కారానికి కమాండర్‌ స్థాయి చర్చలకు పట్టు పడుతుండటం కొసమెరుపు.

China
చైనా
author img

By

Published : Jun 20, 2020, 10:43 AM IST

Updated : Jun 20, 2020, 12:19 PM IST

తూర్పు లద్ధాఖ్​లోని గల్వాన్​ లోయ.. దశాబ్దాలుగా భారత్​ అధీనంలోనే ఉంది. ఇక్కడ చైనాతో ఎలాంటి సరిహద్దు వివాదం లేదని ప్రకటిస్తూ వస్తోంది మన దేశం. చైనా కూడా గల్వాన్​ లోయపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు గల్వాన్​పై సార్వభౌమాధికారం మాదేనంటూ కొత్త వివాదానికి తెరతీసింది పొరుగు దేశం.

కొన్ని రోజులుగా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. విమానాలు, ఆర్టిలరీ గన్స్​తోపాటు భారీ వాహనాలను తరలించాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ తీరాల్లో నావికా దళాన్ని అప్రమత్తం చేసింది భారత్​. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి గల్వాన్​లో హింస చెలరేగింది.

ఆ తర్వాత నుంచి గల్వాన్​, షాయోక్​ నదీ సంగమ ప్రాంతం తమ అధీనంలో ఉంటూ వస్తోందని నెమ్మదిగా వివాదాన్ని ప్రారంభించింది చైనా. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా తాము గస్తీ నిర్వహిస్తున్నామని అబద్ధాలు చెబుతోంది.

చర్చలకు ప్రతిపాదన..

ఏప్రిల్​ నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాదంలో చైనా చేసిన ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. గల్వాన్​పై వివాదాన్ని రాజేస్తూనే పరిష్కారానికి చర్చలకు ప్రతిపాదనలు చేసింది చైనా. సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరగాల్సిందేనని పట్టుబడుతోంది.

చైనా ఆరోపణలు ఇవీ..

గల్వాన్​లో హద్దులను భారత్​ ఏకపక్షంగా మారుస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్​ ఆరోపించారు. "గల్వాన్​ లోయ వాస్తవాధీన రేఖకు చైనా వైపున ఉంది. చాలా ఏళ్లుగా ఇక్కడ గస్తీ నిర్వహిస్తూ చైనా బలగాలు తమ విధులను సాధారణంగానే నిర్వర్తిస్తున్నాయి." అని లిజియాన్​ ప్రకటించారు.

చైనా ప్రకటనకు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్​ టైమ్స్ వంతపాడుతూ వస్తోంది. గల్వాన్​ లోయపై పూర్తి సార్వభౌమాధికారం ఉందని వెస్టర్న్ కమాండ్ అధికార ప్రతినిధి కర్నల్​ ఝాంగ్​ షూలీ ప్రకటించినట్లు గ్లోబల్ టైమ్స్​ జూన్​ 16న వెల్లడించింది. చైనా లేవనెత్తుతున్న కొత్త వివాదానికి గల ప్రాముఖ్యాన్ని ఈటీవీ భారత్ అదే రోజు​ నొక్కి చెప్పింది.

కొత్త వివాదానికి ఆజ్యం..

గల్వాన్​ లోయకు సంబంధించి చైనా చేస్తోన్న ప్రకటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కొన్నేళ్లుగా గల్వాన్​ నదికి ఇరువైపులా 2-3 కిలోమీటర్ల భారత సైన్యం గస్తీ నిర్వహిస్తూ వస్తోంది. ఇరు దేశాల మధ్య 3,488 కి.మీ. పొడవైన సరిహద్దులో ఇప్పటికే చాలా వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. తాజా ప్రకటనతో గల్వాన్​ లోయను కూడా ఈ జాబితాలోకి చేర్చేందుకు చైనా ప్రయత్నస్తోందని స్పష్టమవుతోంది.

అంతేకాదు, "జూన్​ 6న జరిగిన జనరల్​ లెఫ్టినెంట్​ స్థాయి భేటీలో నది దాటి వచ్చి గస్తీ, మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టమని భారత్​ హామీ ఇచ్చింది. కానీ మరోసారి ఎల్​ఏసీ దాటి హింసాత్మక పరిస్థితులకు కారణమయ్యారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అదుపులోకి వచ్చేందుకు మరోసారి కమాండర్ స్థాయి చర్చలు వీలైనంత త్వరలో జరుపుతాం." అని లిజియాన్​ అంటూ భారత్​పై తప్పును తోసే ప్రయత్నం చేశారు.

ఆక్రమించలేదు..

భారత్​- చైనా ప్రతిష్టంభనపై దిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. భారత్​ సరిహద్దులోకి ఎవరూ ప్రవేశించలేదని, అంగుళం భూమిని ఆక్రమించలేదని ప్రకటించారు. జూన్​ 15న చైనా చేసిన ఘాతుకంపై దేశ ప్రజలంతా కోపంగా ఉన్నారని మోదీ అన్నారు.

గల్వాన్​ ఎందుకంత కీలకం?

భారత్​కు సైనికపరంగా గల్వాన్​ లోయ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం. అంతేకాకుండా షాయోక్​, దౌలత్​ బేగ్​ ఓల్డీకి కలిపే 255 కి.మీ. రహదారి గల్వాన్​ మీదుగానే వెళుతుంది. కారకోరం కనుమ సమీపంలో ఉన్న దౌలత్ బేగ్​ ఓల్డీలో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరం ఉంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న గల్వాన్​ లోయ సమీపంలో చైనా స్థావరం ఏర్పాటు చేసుకోవటం జూన్​ 15 ఘర్షణలకు కారణమైంది.

(రచయిత- సంజీవ్ బారువా)

Last Updated : Jun 20, 2020, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.