ETV Bharat / international

అఫ్గాన్​లో 'పెద్దన్న' పాత్రపై చైనా​ కన్ను! - తాలిబన్​ న్యూస్​

అఫ్గానిస్థాన్(Afghanistan Taliban)​ నుంచి అమెరికా వైదొలిగిన(america evacuation) తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చైనా యోచిస్తోందా?(china afghanistan) అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అఫ్గాన్​కు పెద్దన్నగా వ్యవహరించి.. మధ్య ఆసియాలో తన ఆధిపత్యాన్ని చలాయించాలన్న కలను సాకారం చేసుకోవాలనుకుంటోందని అంతర్జాతీయ విశ్లేషణ వెబ్​సైట్​ 'ఇన్​సైడ్​ఓవర్'​ ఓ కథనం ప్రచురించింది.

Afghanistan, China
చైనా, అఫ్గానిస్థాన్​, తాలిబన్​
author img

By

Published : Sep 4, 2021, 3:43 PM IST

రెండు దశాబ్దాల పాటు అఫ్గాన్​కు పెద్దన్నగా వ్యవహరించి.. ఉగ్రవాదంపై సుదీర్ఘ పోరాటం చేసింది అమెరికా. కానీ ఒక్కసారిగా తమ బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుని(america evacuation).. అఫ్గాన్​ సంక్షోభానికి తెరతీసింది. అమెరికా వెనుదిరగడాన్ని అవకాశంగా చూసిన చైనా.. ఇప్పుడు అఫ్గాన్​పై పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధపడుతోంది(china afghanistan). అగ్రరాజ్యం వైదొలిగిన అనంతరం ఏర్పడిన ఖాళీని చైనా భర్తీ చేయాలని యోచిస్తోంది. మధ్య ఆసియాలో ఆధిపత్యం చలాయించాలనే తన కలను నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే అనేకమార్లు అమెరికాపై విరుచుకుపడింది. తాలిబన్లు అఫ్గాన్​ను(Afghanistan Taliban) ఆక్రమించుకున్న తొలినాళ్లలో అమెరికా విమానం నుంచి ప్రజలు జారిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వాటిపై వెంటనే స్పందించిన చైనా.. విమర్శలు గుప్పించింది. అఫ్గాన్​ శరణార్థులను తరలించటంలో అమెరికాకు సరైన వ్యూహం లేదని ఆరోపించింది.

అంతర్జాతీయ విశ్లేషణ వెబ్​సైట్​ 'ఇన్​సైడ్​ఓవర్'​కు రాసిన వ్యాసంలో.. ఫెడెరికో గియులియాని అనే రచయిత చైనా వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పొరుగు దేశం నుంచి అమెరికా వైదొలగటం పట్ల బీజింగ్​ సంతోషంగా ఉందన్నారు.

"మధ్య ఆసియాలో తన ఆధిపత్యం కోసం బీజింగ్​ సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తోంది. రష్యాతో పాటు షాంఘై సెంట్రల్​ ఆర్గనైజేషన్​ ద్వారా ప్రాంతీయ గతిశీలతను మార్చాలని భావిస్తోంది. అయితే.. చాలా కాలంగా తన ప్రణాళికల్లో అఫ్గానిస్థాన్​ లేదు. నిజానికి అఫ్గానిస్థాన్​లో అమెరికా బలగాల మోహరింపు ఓ విధంగా చైనాకు అవసరమైన భద్రతా, దాని ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి ఉపయోగపడింది. కానీ అమెరికా, ఇతర దేశాలతో కలిసి పనిచేసేందుకు బీజింగ్​ ఎప్పుడూ ముందుకు రాలేదు. పాశ్చాత్య దేశాల నిష్క్రమణ ఇప్పుడు అఫ్గానిస్థాన్​పై చైనా తన ముద్ర వేయడానికి అవసరమైన మార్గాన్ని అందించింది."

- ఫెడెరికో గియులియాని, రచయిత

అమెరికా బలగాలు వెళ్లిపోయిన తర్వాత తాలిబన్​ సేనలు కాబుల్​ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఆ తర్వత మొదటగా తాలిబన్లకు అనుకూలంగా ప్రకటన చేసింది చైనానే. తాలిబన్లతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు.. అఫ్గాన్​ నుంచి అమెరికా వైదొలగటంపై ప్రపంచవ్యాప్తంగా నిపుణుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. సరైన నిర్ణయం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్​ను వీడటం సమాధానం లేని ప్రశ్నగా పేర్కొంది యూరప్​కు చెందిన నిపుణుల కమిటీ.

ఇదీ చూడండి: Afghan Taliban 'చైనా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి'

Afghan news: అఫ్గాన్‌ సంపదపై డ్రాగన్‌ కన్ను.. తాలిబన్లతో మంతనాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.