కమ్యునిస్టు పార్టీ సహా నియంతృత్వ పార్టీలతో సంబంధాన్ని బట్టి ఇతర పౌరులకు దేశంలోకి అనుమతించేందుకు అమెరికా తీసుకొచ్చిన విధానాన్ని చైనా వ్యతిరేకించింది. ఈ విధానంపై చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు షిజిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే, ప్రతిభావంతులను చైనాలోనే ఉంచేందుకు తాజా విధానం సహాయపడుతుందని అన్నారు.
"చైనాలోని చాలా మంది ప్రతిభావంతులు చైనా కమ్యునిస్టు పార్టీలో సభ్యులు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రతిభావంతులను చైనాలో ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ నిర్ణయం వారి భ్రమను తెలియజేస్తోంది. కమ్యునిస్టు పార్టీ సభ్యులు కానివారు కూడా అమెరికాకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు."
-హు షిజిన్, గ్లోబల్ టైమ్స్ ఎడిటర్
కమ్యునిస్టు పార్టీ, లేదా ఇతర నియంతృత్వ పార్టీలతో సభ్యత్యం, అనుబంధం ఉన్న వ్యక్తులకు అనుమతి నిరాకరించే విధానంపై అమెరికా పౌరతస్వం, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం శుక్రవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే చైనా, అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా సహా హాంకాంగ్ భద్రత చట్టం, ఉయ్గుర్ల పట్ల చైనా ప్రవర్తనపై అమెరికా ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం తాజా విధానం రూపొందించింది.
ఇదీ చదవండి- 'బైడెన్‌కే ప్రవాసీల మద్దతు- గుజరాతీలు మాత్రం...'