చైనాలో కొత్తగా మొబైల్ సర్వీస్‌ను వినియోగించాలంటే ముఖాన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన నిబంధన ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. సైబర్ ప్రపంచంలో ప్రజలకు ఉన్న హక్కులు, అవకాశాలను ఈ చట్టం రక్షిస్తుందని చైనా ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
చైనా ఇప్పటికే జనాభా లెక్కలు సహా వివిధ కార్యక్రమాలకు ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఇప్పుడు తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం కొత్త మొబైల్ కొన్నప్పుడు, మొబైల్ డేటా కాంట్రాక్టులను తీసుకున్నప్పుడు ప్రజలు.. వారి జాతీయ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలి. ఇక నుంచి ఐడీతో పాటు వారి ముఖాన్ని స్కాన్ చేస్తారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన ఐడీ సరైందో కాదో గుర్తించే అవకాశం ఉంది.
చాలా రోజుల నుంచి తమ దేశస్థులు అసలు పేరుతోనే ఇంటర్నెట్ వినియోగించేలా చైనా నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఎవరైనా ఆన్‌లైన్లో కొత్త విషయాన్ని పోస్టు చేయాలంటే వారి అసలైన ఐడీని వెల్లడించాలని 2017లో నిబంధన పెట్టింది.
ఇదీ చూడండి:- లండన్‌లో క్రిస్మస్ వేడుకలు షురూ- అదిరిన లైట్షో