భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం తమ భవిష్యత్ దౌత్య ప్రాధాన్యాల్లో ఒకటని తెలిపింది చైనా. ఇరు దేశాలు సంయుక్తంగా సరిహద్దులో శాంతి, భద్రతను కాపాడి స్థిరత్వాన్ని నెలకొల్పాలని పేర్కొంది. కరోనా కారణంగా ఊహించని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇతర దేశాలతో కలిసి ముందుకు సాగేందుకు చైనా ప్రణాళికలేంటి? అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్.
" మా పొరుగు దేశాలలో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం. వ్యూహాత్మక పరస్పర విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నాం. పొరుగు దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో భాగస్వామ్య ప్రయోజనాలను విస్తరించాలనుకుంటున్నాం. రష్యాతో సంబంధాల్లో పురోగతి సాధించాం."
-ఝావో లిజియాన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: ట్రంప్‌కు '7 కీస్' గండం- ఎన్నికల్లో ఓటమి తథ్యం!