ETV Bharat / international

చైనాలో యాక్టివ్​ కేసులు 395 మాత్రమే!

పాకిస్థాన్​లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 1315 వైరస్​ బారిన పడగా.. మొత్తం కేసుల సంఖ్య 21వేలు దాటింది. చైనాలోనూ మరో 16 మందిలో వైరస్​ ఉన్నట్లు నిర్ధరణ అయింది. అయినప్పటికీ ఆ​ దేశంలో 395 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉండటం గమనార్హం.

author img

By

Published : May 5, 2020, 2:56 PM IST

China has 395 corona active cases only
చైనాలో యాక్టివ్​ కేసులు 395 మాత్రమే!

కరోనా పుట్టుకకు కేంద్ర బిందుమైన చైనాలో వైరస్​ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గగా.. మంగళవారం 16 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​(ఎన్​హెచ్​సీ) ప్రకటించింది. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని.. ఇందులో 15 మందికి వ్యాధి లక్షణాలేమీ లేకున్నా వైరస్​ పాజిటివ్​గా తేలిందని అధికారులు పేర్కొన్నారు. స్థానికంగా ఎవరికీ వైరస్ సోకలేదని వెల్లడించారు. కొవిడ్​-19తో కొత్తగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేశారు.

చైనాలో ఇప్పటివరకు మొత్తం 82,881 మందికి వైరస్ సోకింది. 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. 77,853 మంది మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అక్కడ ప్రస్తుతం 395 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నాయి.

పాకిస్థాన్​లో 21వేలకుపైనే...

పాకిస్థాన్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్​ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 1315 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 21,501కి చేరింది. కొత్తగా 24 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కరోనాకు బలైన వారి సంఖ్య 486కు చేరింది.

దేశంలో కేసులు పెరుగుతున్నప్పటికీ.. లాక్​డౌన్​ ఆంక్షలను సడలించనున్నట్లు తెలిపారు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​. లాక్​డౌన్​ను ఇలాగే కొనసాగిస్తే.. దేశ మనుగడ కష్టమన్న ఆయన.. క్రమంగా వీటిని ఎత్తివేస్తామని సోమవారమే ప్రకటించారు.

టర్కీలోనూ ఇప్పటికే 1,27,659 మందికి వైరస్​ సోకినప్పటికే.. ఆంక్షలను సడలించేందుకు సిద్ధమయ్యారు అధ్యక్షుడు రీసెప్​ తయ్యిప్​ ఎర్డోగన్​.

శ్రీలంకలో నౌకాదళ సిబ్బందికి..

ద్వీపదేశమైన శ్రీలంకలో మొత్తం 755 కరోనా కేసులున్నాయి. ఇందులో 194 మంది కోలుకున్నారు. 8 మంది మృతి చెందారు. ప్రస్తుతం 553 యాక్టివ్​ కేసులున్నాయి. ఇందులో 327 మంది నౌకా దళ సిబ్బందే ఉండటం గమనార్హం.

వరల్డ్​ ఎక్స్​పో​ కొత్త తేదీలు ప్రకటన

ఈ ఏడాది దుబాయ్​లో జరగాల్సిన వరల్డ్​ ఎక్స్​పో 2020 కార్యక్రమాన్ని వచ్చే ఏడాది అక్టోబర్​కు వాయిదా వేశారు నిర్వాహకులు. కరోనా వైరస్​ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2021 అక్టోబర్​ 1 నుంచి 2022 మార్చి 31 వరకు వరల్డ్​ ఎక్స్​పో జరుగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : భారత్​లో 50 లక్షల మంది నిరాశ్రయులా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.