కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆంక్షల సడలింపును ముమ్మరం చేస్తోంది చైనా. 75 శాతం సామర్థ్యంతో సినిమా హాళ్లు, వినోద ప్రదర్శన వేదికలకు అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా, స్థానిక అధికారుల సమ్మతితో వ్యాప్తి తక్కువగా ప్రాంతాల్లో వాణిజ్య ప్రదర్శనలనూ ప్రారంభించవచ్చని చైనా సంస్కృతి, పర్యటక శాఖ పేర్కొంది.
స్థానిక పరిస్థితుల ఆధారంగా వీక్షకుల సంఖ్యను అధికారులు నిర్ణయిస్తారని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అయితే, ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకోవాలని తెలిపింది. మాస్కులు, శరీర ఉష్ణోగ్రత తనిఖీలు తప్పనిసరి చేయాలని సూచించింది. అయితే, వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి లేదని అధికారులు చెప్పారు.
చైనాలో ఇప్పటివరకు 85,269 కేసులు నమోదయ్యాయి. వీరిలో 80,464 మంది కోలుకోగా 4,634 మంది మరణించారు. 171 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: కరోనా పంజా: కొలంబియాలో 7.5 లక్షలు దాటిన కేసులు