ETV Bharat / international

కరోనాకు కారణం వుహాన్​ ప్రయోగశాల కాదు: చైనా - who team goes to chaina onfinding of corona vairus outbreak

కరోనా వైరస్ తమ దేశంలో ఉద్భవించలేదని చైనా మరోసారి తేల్చిచెప్పింది. వైరస్​ మూలాలను కనుగొనడానికి డబ్ల్యూహెచ్​ఓ బృందం.. చైనాను ఈ నెలలో సందర్శించనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

China denies coronavirus leaked from Wuhan lab, says global outbreaks caused pandemic
కరోనాకు కారణం వుహాన్​ ప్రయోగశాల కాదు: చైనా
author img

By

Published : Jan 5, 2021, 7:57 AM IST

కరోనా వైరస్​ మూలాలు వుహాన్​లోని ఒక జీవ ప్రయోగశాలలో ఉన్నాయని అమెరికా చేసిన ఆరోపణను చైనా మరోసారి తోసిపుచ్చింది. ప్రపంచంలోని వేర్వేరు ప్రదేశాల్లో ఇది వెలుగులోకి వచ్చి ఉంటుందే గానీ తమ ల్యాబ్​ నుంచి కాదని స్పష్టం చేసింది.

కరోనా పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో)కు చెందిన 10మంది సభ్యుల బృందం ఈ నెలలో వచ్చి దర్యాప్తు నిర్వహిస్తుందన్న వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్​యింగ్​ సోమవారం ఈ మేరకు స్పందించారు. వుహాన్​ నగరాన్ని ఈ బృందం సందర్శించడానికి అనుమతి ఇచ్చేదీ లేనిదీ చైనా ఇంకా తేల్చి చెప్పలేదు. డబ్ల్యూహెచ్​వోతో సహకారానికి అత్యంత ప్రాధాన్యమిస్తామని మాత్రం హువా చెప్పారు.

ఇదీ చదవండి:కొత్త రకం కరోనాతో బ్రిటన్​లో మళ్లీ లాక్​డౌన్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.