ETV Bharat / international

ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై ఆరోపణలు: చైనా - Chinese Foreign Ministry news

కరోనా వైరస్​ మూలాలను దాస్తోందని తమపై అమెరికా చేసిన ఆరోపణలను ఖండించింది చైనా. గందరగోళం సృష్టించి.. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు ఉద్ఘాటించింది. ఎప్పుడూ కరోనా సమచారం దాయలేదని.. ఆ అవసరం తమకు లేదని స్పష్టం చేసింది.

China denies coronavirus cover-up
ప్రజల దృష్టి మళ్లించేందుకే మాపై ఆరోపణలు: చైనా
author img

By

Published : Apr 17, 2020, 7:12 PM IST

కరోనా కేసుల వివరాలను, వైరస్​ మూలాలను దాస్తోందని అమెరికా చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది చైనా. ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. వుహాన్​ ప్రయోగశాలలో వైరస్​ను తయారు చేసినట్లు ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.

ఈ రోజు ఉదయం.. వుహాన్​లో మరణాల రేటును ఒక్కసారిగా 50 శాతం పెంచింది చైనా. మొత్తం కేసుల సంఖ్యను 4,632 సవరించిన సందర్భంగా వివరణ ఇచ్చారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్​.

" అంతర్జాతీయంగా ఆమోదించిన పద్ధతిలోనే కరోనా సమాచారాన్ని సవరించినట్లు నొక్కిచెప్పాలనుకుంటున్నా. వైరస్​ వ్యాప్తి తొలినాళ్లలో సమాచారం అందటంలో ఆలస్యం, లోపాలు ఉన్నాయి. ఆస్పత్రుల్లో తగినంత సామర్థ్యం లేకపోవటం, కొన్ని వైద్య సంస్థలు వ్యాధి నివారణ, సమాచార వ్యవస్థలతో సకాలంలో అనుసంధానం కాకపోవటం ఇందుకు కారణం. కానీ.. మేము ఎప్పుడూ సమాచారం దాయలేదు. దాచిపెట్టడాన్ని అనుమతించం కూడా. "

- జావో లిజియాన్​, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.

వుహాన్​ ప్రయోగశాల నుంచే వైరస్​ పుట్టిందా లేదా అనే విషయంపై దర్యాప్తు చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో చేసిన వ్యాఖ్యలను ఖండించారు జావో. ప్రజల దృష్టిని మళ్లించేందుకే అలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శించారు.

" కొందరు అమెరికా ప్రజలు చైనాపై ఆరోపణలు చేశారు. దాని ఉద్దేశం గందరగోళాన్ని సృష్టించటం, ప్రజల దృష్టిని మళ్లించటానికే అని వివేకం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై స్పష్టత ఇచ్చాం. వైరస్​ మూలాలు తెలుసుకోవటం అనేది ఓ శాస్త్రీయ సమస్య. శాస్త్రీయ, నిపుణుల అభిప్రాయాలను గౌరవించటం మన బాధ్యత. వుహాన్​ ల్యాబ్​లో ఈ వైరస్​ పుట్టినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసిన విషయాన్ని మరోమారు గుర్తు చేస్తున్నా "

ఇదీ చూడండి: చైనాలో ఒక్కసారిగా 1,290 పెరిగిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.