China delta cases: చైనాలో వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. జెజియాంగ్ రాష్ట్రంలో వారం వ్యవధిలో 138 స్థానిక సంక్రమణ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ డెల్టా స్ట్రెయిన్‌కు చెందిన సబ్‌వేరియంట్ 'ఏవై.4' రకానికి చెందినవని సమాచారం.
China Covid cases rising
ఒకేసారి ఇన్ని కేసులు రావడం చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమిగూడకుండా ఆదేశాలు జారీ చేశారు.
China covid delta variant
డిసెంబర్ 5-12 మధ్య ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో లక్షణాలు లేని కేసులు సైతం ఉన్నాయని షిన్హువా న్యూస్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే ఈ రాష్ట్రంలో 74 కేసులు బయటపడ్డాయని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 80 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మిగిలిన ఆరింటిలో ఐదు ఇన్నర్ మంగోలియా, ఒకటి షాంక్సీ ప్రాంతంలో వెలుగుచూసినట్లు వివరించింది.
China winter Olympics
కరోనాను చైనా సమర్థంగా కట్టడి చేస్తోంది. సున్నా కేసుల విధానాన్ని అనుసరించి కఠిన చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేస్తోంది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌కు ముందు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు చైనాలో 99,780 కేసులు నమోదయ్యాయి. 1381 మందికి చికిత్స కొనసాగుతోంది. వైరస్‌తో దేశంలో 4,636 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: Omicron Variant Cases: '63 దేశాల్లో ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్‌ను మించి!'