యుద్ధ వాతావరణంతో కకావికలమైన అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాల సత్వర ఉపసంహరణ తొందరపాటు చర్యగా చైనా అభివర్ణించింది. శాంతి ప్రక్రియకు, ప్రాంతీయ సుస్థిరతకు ఇది విఘాతమని.. ఐక్యరాజ్యసమితి తగిన పాత్ర పోషించక తప్పదని తెలిపింది.
ఈ విషయమై చైనా, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, షా మహమూద్ ఖురేషీ నడుమ టెలిఫోన్ చర్చలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ముగుస్తుందనుకొన్న దళాల ఉపసంహరణను వెనువెంటనే పూర్తి చేయటంపై వాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్, పాకిస్థాన్ సభ్యులుగా ఉన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ)ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుందని తెలిపారు. పాకిస్థాన్‌కు అన్నివిధాలా అండగా ఉన్న చైనాకు ఖురేషీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి : గుజరాత్ వైపు 'తౌక్టే'- ముంబయిలో ఆరెంజ్ అలర్ట్