ETV Bharat / international

'సరిహద్దు దాటి భారత బలగాలే కాల్పులు జరిపాయి'

తూర్పు లద్దాఖ్​లో కాల్పుల ఘటనపై భారత్​ను తప్పుబడుతూ చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ ఆరోపణలు చేసింది. ఇరు దేశాల మధ్య ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత బలగాలు వాస్తవాధీన రేఖను దాటి కాల్పులు జరిపారని పేర్కొంది. ఈ చర్యలకు పాల్పడిన అధికారులపై భారత్​ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చైనాకు చెందిన ఓ అధికారి డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

INDIA CHINA
భారత్ చైనా
author img

By

Published : Sep 8, 2020, 10:40 AM IST

సరిహద్దుల్లో కాల్పుల ఘటనకు సంబంధించి భారత్​పై చైనా అధికారిక మీడియా గ్లోబల్​ టైమ్స్​ ఆరోపణలు చేసింది. భారత బలగాలు వాస్తవాధీన రేఖను అక్రమంగా దాటాయని, అందుకు అనుగుణంగా చైనా బలగాలు ప్రతిస్పందించాల్సి వచ్చిందని పేర్కొంది.

INDIA CHINA
గ్లోబల్ టైమ్స్ ట్వీట్​

"భారత బలగాలు సరిహద్దు పశ్చిమ భాగంలో వాస్తవాధీన రేఖను దాటాయి. పాంగాంగ్ సరస్సు దక్షిణ ఒడ్డుకు సమీపంలోని షెన్​పావో పర్వత ప్రాంతానికి చేరుకున్నాయని వెస్టర్న్​ కమాండ్​ సీనియర్​ కర్నల్​ జాంగ్​ షియూలీ చెప్పారు.

ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను భారత్​ ఉల్లంఘించి ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచింది. ఇది తీవ్ర పరిస్థితులకు దారితీస్తుందని షియూలీ అన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన కదలికలను భారత సైన్యం ఆపేయాలి. వాస్తవాధీన రేఖ నుంచి వెనుదిరగాలి."

- గ్లోబల్ టైమ్స్ ట్వీట్​

ఈ చర్యకు పాల్పడిన అధికారులను భారత ప్రభుత్వం విచారించి, కాల్పులు జరిపిన అధికారిని శిక్షించాలని షియూలీ డిమాండ్ చేసినట్లు గ్లోబల్​ టైమ్స్ పేర్కొంది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారని తెలిపింది.

సరిహద్దుల్లో కాల్పులు..

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద కాల్పుల జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భారత్​-చైనా దళాలు మూడు నెలలుగా స్టాండ్​-ఆఫ్​లో ఉన్నాయి.

పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన ఉన్న వ్యూహాత్మక ఎత్తును భారత్ ఇటీవల చేజిక్కించుకుంది. దీనితో పాంగాంగ్​ దక్షిణ తీరంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనా ఇటీవల చేసిన ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.

ఇదీ చూడండి: తూర్పు లద్దాఖ్‌లోని ఎల్​ఏసీ వద్ద కాల్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.