కరోనా రోగుల కోసం ఐదు రోజుల్లోనే 6500 గదులు కలిగిన ఆసుపత్రిని చైనా నిర్మించింది. వైరస్ విజృంభించిన కారణంగా హుబే రాష్ట్రం నాంగ్యాంగ్ నగరంలో దీనిని నిర్మించినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది.
దేశంలో మొత్తం 130 కొత్త కేసులు నమోదుకాగా అందులో 90 హుబేలోనే నమోదయ్యాయి.
వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న షిన్జియాంగ్ నగరంలో మరో భారీ అసుపత్రిని చైనా నిర్మిస్తోంది. 3000 గదులు కలిగిన ఈ ఆసుపత్రిలో మూడువంతులను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న వూహాన్ నగరంలోనూ ఇదే తరహా నిర్మాణాన్ని చైనా చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి:ముష్కరుల మధ్య అంతర్గత దాడి- 12 మంది మృతి