ETV Bharat / international

'భారత్​-పాక్​ మధ్య సయోధ్యకు చైనా ప్రయత్నాలు' - 'భారత్​-పాక్​ మధ్య సయోధ్యకు చైనా ప్రయత్నాలు'

జమ్ముకశ్మీర్​ పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​-పాక్​ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చర్చల ద్వారా పరిష్కరించేందుకు చైనా కృషి చేసినట్లు వెల్లడించారు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్​ యీ. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు తెరవెనుక బీజింగ్​ చేపట్టిన చర్యలను వెల్లడించారు. భారత్​-చైనాల మధ్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 70 రకాల కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు వాంగ్​.

China backed efforts to defuse Indo-Pak tensions post-Pulwama attack: Wang
'భారత్​-పాక్​ మధ్య సయోధ్యకు చైనా ప్రయత్నాలు'
author img

By

Published : Dec 25, 2019, 5:10 AM IST

Updated : Dec 25, 2019, 7:47 AM IST

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్​-పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు, చర్చల ద్వారా సమస్య పరిష్కరించే ప్రయత్నాలకు చైనా మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్​ యీ. ఈ విషయంలో తెరవెనుక నుంచి బీజింగ్​ చేపట్టిన చర్యలను నొక్కి చెప్పారు.

చైనా 2019 దౌత్య విజయాలపై అధికార కమ్యూనిస్ట్​ పార్టీ వార్తాసంస్థ పీపుల్స్​ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుల్వామా అనంతరం భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు బీజింగ్​ చేసిన కృషిని ప్రస్తావించారు వాంగ్​.

"భారత్​-పాక్​ల మధ్య ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నాలకు చైనా మద్దతు పలికింది. ఇరు దేశాల మధ్య వ్యత్యాసాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేశాం. ఈ ఏడాది పోరుగు దేశాలతో దౌత్య విషయంలో చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి. మొదటగా పొరుగు దేశాలతో అన్ని విధాలుగా సంబంధాల బలోపేతం చేపట్టాం. చెన్నైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అధ్యక్షుడు షి జిన్​పింగ్​ల మధ్య రెండో సమావేశం విజయవంతమైంది. భారత్​-చైనా సంబంధాల బలోపేతంపై చర్చించారు. పరస్పర సహకారంపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు."

- వాంగ్​ యీ, చైనా విదేశాంగ మంత్రి.

2020ని 'భారత్​-చైనా సంస్కృతి, ప్రజాసంబంధాల మార్పిడి సంవత్సరం'గా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు వాంగ్​. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 70 కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు.

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​​పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా పాక్​ బాలాకోట్​లోని ఉగ్రస్థావరాలపై వైమానిక దాడి చేసింది భారత్​. ఫిబ్రవరి 27న పాక్​ యుద్ధవిమానాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. వారిని తిప్పికొట్టే ప్రయత్నంలో భారతీయ వైమానిక దళ విమానం పీఓకేలో కూలిపోయింది. పైలట్​ను అదుపులోకి తీసుకున్నాయి పాక్​ బలగాలు. అయితే.. వెంటనే పైలట్​ను విడుదల చేస్తామని ప్రకటించిన పాక్​ అనంతరం భారత్​కు అప్పగించింది.

ఇదీ చూడండి: కశ్మీర్​లో బలగాల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం

RESTRICTION SUMMARY: MUST CREDIT WJLA;  NO ACCESS WASHINGTON DC MARKET;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WJLA - MUST CREDIT WJLA;  NO ACCESS WASHINGTON DC MARKET;  NO USE BY US BROADCAST NETWORKS;  NO RE-SALE, RE-USE OR ARCHIVE
Alexandria, Virginia - 24 December 2019
1. Various of Santa, helpers waterskiing on Potomac River
2. Santa, helpers come ashore, wave to onlookers
STORYLINE:
Santa and his helpers water-skied along the Potomac River on Christmas Eve,  as they have every year since 1986.
The tradition began more than 30 years ago when a man lost a bet to friends and agreed to water-ski in a Santa suit, according to the event's webpage.
Santa, alongside elves, reindeer and even the Grinch, waved as they skied past onlookers, occasionally performing flips and tricks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 25, 2019, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.