ETV Bharat / international

'అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తి కావాలనే ఉద్దేశం లేదు'

అమెరికా-చైనాల మధ్య సయోధ్యకు పావులు కదుపుతోంది జిన్​పింగ్​ సర్కార్​. ఈ మేరకు తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్​ ప్రభుత్వాన్ని కోరింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. అంతేకాకుండా.. తైవాన్​, హాంకాంగ్​, షింజియాంగ్​, టిబెట్​లపై జోక్యాన్ని తగ్గించుకోవాలని సూచించింది.

China urges US to lift trade restrictions, stop interference
వాణిజ్య ఆంక్షలు తొలగించాలని అమెరికాను కోరిన చైనా
author img

By

Published : Feb 22, 2021, 12:16 PM IST

అమెరికా.. తమపై విధించిన వాణిజ్యపరమైన ఆంక్షలను తొలగించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ సోమవారం తెలిపారు. అంతేకాకుండా తమ అధీనంలోని తైవాన్​, హాంకాంగ్​, షింజియాంగ్​, టిబెట్​లో అనవసర జోక్యాన్ని వీడాలని కోరారు. అక్కడి వేర్పాటువాద శక్తులకు అమెరికా మద్దతు ఇవ్వడం ఆపాలన్నారు. ఇరుదేశాల సంబంధాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్​ ప్రభుత్వంపై జిన్​పింగ్​ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు వాంగ్​ యీ.

"అమెరికా నూతన పాలనా యంత్రాంగం.. విదేశాంగ విధానాన్ని సమీక్షిస్తుందని భావిస్తున్నాం. ఈ విషయంలో బైడెన్​ సర్కార్​ వేగంగా స్పందించడం సహా.. పక్షపాత ధోరణిని వీడి, అన్ని దేశాలను ఒకేలా చూస్తుందని మేం ఆశిస్తున్నాం. అనవసరమైన కలహాలను వదిలేసి, ఇరుదేశాల అభివృద్ధి కోసం సత్సంబంధాలను కొనసాగించాలని కోరుతున్నాం. చైనా-అమెరికా అనే భారీ ఓడను నడిపించేందుకు ఇరుపక్షాలు కలిసి పనిచేస్తాయని విశ్వసిస్తున్నాం."

- వాంగ్​ యీ, చైనా విదేశాంగ మంత్రి

ట్రంప్​ పాలనలో చైనా వృద్ధి గణనీయంగా పడిపోయిందన్న వాంగ్​.. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలపై సహకారాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తిగా మారే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. కరోనా మహమ్మారి, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ వంటి అతిపెద్ద సమస్యలపై దృష్టిసారించాలన్నారు.

ఇదీ చదవండి:
'2022లోనూ అమెరికన్లకు మాస్కులు తప్పవు
'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.