ETV Bharat / international

16 కొవిడ్ టీకాల క్లినికల్​ పరీక్షలకు చైనా ఓకే

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 16 కొవిడ్​ టీకాల క్లినికల్​ ట్రయల్స్​కు చైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో 6 టీకాలు ప్రస్తుతం మూడో దశ క్లినికల్​ పరీక్షలు జరుపుకుంటున్నాయి. మరోవైపు.. వయోజనులందరికీ జులై 31 లోపు టీకా వేసేందుకు బ్రిటన్​ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

china covid vaccine clinical trails
చైనాలో 16 కొవిడ్ టీకాల క్లినికల్​ పరీక్షలు
author img

By

Published : Feb 21, 2021, 5:13 PM IST

చైనాలో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 16 కొవిడ్​ టీకాల క్లినికల్​ ప్రయోగాలకు.. ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటిలో ఆరు టీకాలు.. మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.

ప్రొటీన్​, అడినోవైరస్​, న్యూక్లిక్​ యాసిడ్​, ఇన్​ఫ్లూయెంజా సాంకేతికతతో ఈ టీకాలు అభివృద్ధి చేస్తున్నారని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

చైనాలో ఇప్పటికే సినోఫామ్​, సినోవాక్​ బయోటెక్​ అనే రెండు కొవిడ్​ టీకాలకు షరుతులతో కూడిన అనుమతులు ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. ఫిబ్రవరి 9 నాటికి 40.52 మిలియన్ల టీకా డోసులను అందించింది.

జులై చివరి నాటికి..

కొత్త రకం కరోనాతో అల్లాడుతున్న బ్రిటన్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జులై 31 నాటికి దేశంలోని వయోజనులందరికీ టీకా మొదటి డోసు అందిస్తామని తెలిపింది.

యాభై ఏళ్ల వయస్సు పైబడినవారికి మే 1 లోపు టీకా వేయాలని బ్రిటన్​ తొలుత లక్ష్యం నిర్దేశించుకోగా.. తాజాగా ఈ గడువును ఏప్రిల్​ 15కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైజర్​, ఆస్ట్రాజెనెకా టీకాలను బ్రిటన్​లో వినియోగిస్తున్నారు.

దేశ పౌరులందరికీ టీకా సరఫరా చేసే సామర్థ్యం తమకు ఉందని బ్రిటన్​​ ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. బ్రిటన్​లో డిసెంబర్​ 8న వ్యాక్సినేషన్​ ప్రారంభించగా ఇప్పటివరకు 1.72 కోట్ల మందికి మొదటి డోసు టీకా అందించింది. ఆ దేశంలో కరోనా ధాటికి ఇప్పటివరకు 1.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:భారత్​ను ప్రశంసించిన ఐరాస చీఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.