ETV Bharat / international

జీవాయుధాల తయారీకి చైనా-పాక్ రహస్య ఒప్పందం! - Experiments on biological weapons in Pakistan

జీవాయుధాలను తయారు చేసేందుకు పాకిస్థాన్, చైనా రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆస్ట్రేలియా మీడియాలో కథనం ప్రచురితమైంది. కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధులపై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ఉద్దేశమని కథనం పేర్కొంది. పాకిస్థాన్​కు చెందిన డెస్టోతో వుహాన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించింది.

China & Pakistan enter 'secret deal' to expand bio-warfare tools,"
జీవాయుధాల తయారీకి చైనాతో పాక్ రహస్య ఒప్పందం!
author img

By

Published : Jul 27, 2020, 7:18 AM IST

ప్రమాదకరమైన జీవ ఆయుధాలను తయారుచేసేందుకు పాకిస్థాన్‌, చైనాలు ఒక రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. ఆంత్రాక్స్‌కు సంబంధించిన పరిశోధన ప్రాజెక్టులనూ ఆ రెండు దేశాలు చేపట్టాయని తెలిపింది. అయితే ఈ వార్తలను పాకిస్థాన్‌ కొట్టిపడేసింది. ఇది రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కథనమని పేర్కొంది.

పరిశోధనాత్మక దినపత్రిక 'ద క్లాక్సన్‌' ఈ కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్‌కు చెందిన సైనిక రక్షణ శాస్త్ర, సాంకేతిక సంస్థ (డెస్టో)తో చైనాకు చెందిన వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ మూడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుందని అందులో పేర్కొంది. 'కొత్తగా ఉత్పన్నమవుతున్న అంటువ్యాధుల'పై సంయుక్తంగా పరిశోధన చేయడం దీని ఉద్దేశమని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.