ETV Bharat / international

'మాకు వీడియో లింక్​ పంపలేదు'.. కాప్​26 గైర్హాజరుపై చైనా - కాప్​26 సదస్సుకు జిన్​పింగ్​ గైర్హాజరు

గ్లాస్గోలో జరిగిన కాప్​26 ప్రపంచ నేతల సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ హాజరు కాకపోవడం(Cop26 China Not Attending) సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే.. దీనిపై స్పందించిన చైనా.. తమకు ఆ సదస్సు నిర్వాహకులు వీడియోలింక్​ను పంపలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో.. కాప్​ సదస్సుకు వాతావరణ మార్పుల కట్టడిలో తమ నిర్ణయాలను వివరిస్తూ ఓ లేఖను పంపినట్లు చెప్పింది.

xi jinping
జిన్​పింగ్​
author img

By

Published : Nov 3, 2021, 6:50 AM IST

వాతావరణ మార్పుల కట్టడి కోసం గ్లాస్గో వేదికగా జరిగిన కాప్​26 ప్రపంచ నేతల సదస్సుకు(Cop26 World Leaders Summit) చైనా అధ్యక్షుడు జిన్​పింగ్(Cop26 China Not Attending) డుమ్మాకొట్టారు. జిన్​పింగ్ వర్చువల్​గా ఈ సమావేశానికి​ హాజరు అవుతారని అంతా భావించినప్పటికీ.. ఆయన గైర్హాజరయ్యారు. దాంతో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో చైనా తన వైఖరిని మార్చుకోనుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే.. దీనిపై చైనా తాజాగా స్పందించింది. కాప్​26 సదస్సు(Cop26 Summit 2021) నిర్వాహకులు తమకు వీడియోకాల్​ లింక్​ పంపించలేదని ఆరోపించింది. అందుకే జిన్​పింగ్​ ఈ సదస్సుకు హాజరు కాలేదని చెప్పింది.

లిఖితపూర్వక ప్రకటన..

వాతావరణ మార్పులపై తమ నిర్ణయాలను వివరిస్తూ కాప్​26కు జిన్​పింగ్(Cop26 China Delegation)​ ఓ లిఖితపూర్వక ప్రకటనను పంపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సమష్టిగా పోరాడాలని ఆ ప్రకటనలో జిన్​పింగ్​ పేర్కొన్నారు. అయితే.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిన్​పింగ్ హాజరవకుండా ఈ లేఖను ఎందుకు పంపారని బీజింగ్​లో ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ ​వెన్​బిన్​ను విలేకరులు ప్రశ్నించారు. "నాకు తెలిసిన విషయం ఏంటంటే.. కాప్​26 సదస్సు నిర్వాహకులు వీడియో లింక్​ను పంపలేదు. అందుకే జిన్​పింగ్​ హాజరుకాలేదు" అని ఆయన సమాధానమిచ్చారు.

అప్పటి నుంచి వర్చువల్​గానే..

కరోనా నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.. విదేశీ ప్రయాణాలను మానుకున్నారు. గతేడాది జనవరి మధ్యలో మయన్మార్​లో ఆయన చివరిసారి పర్యటించారు. అప్పటి నుంచి అనేక అంతర్జాతీయ సమావేశాలకు జిన్​పింగ్ వీడియోకాల్​ ద్వారా మాత్రమే హజరవుతున్నారు. అక్టోబరు 30న రోమ్​లో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులోనూ ఆయన వర్చువల్​గానే పాల్గొన్నారు.

కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరించే దేశాల్లో ఒకటైన చైనా నుంచి కాప్​26 సదస్సుకు ఆ దేశ ప్రతినిధి హజరుకాకపోవడం(Cop26 China Not Attending) వల్ల వాతావరణ మార్పుల కట్టడిలో ఆ దేశ నిబద్ధతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. కాప్​26 సదస్సు ప్రారంభమవటానికి ముందే గత గురువారం వాతావరణ మార్పుల కట్టడికి దేశీయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను(ఎన్​డీసీ)లను ఐక్యరాజ్య సమితికి చైనా సమర్పించింది. అందులో 2030 కంటే ముందునాటికి చైనాలో ఉద్గారాలు గరిష్ఠ స్థాయికి చేరుతాయని.. 2060 నాటికి నెట్​ జీరో స్థాయికి పరిమితం చేస్తుందని పేర్కొంది. అయితే.. పర్యావరణ కార్యకర్తలు చైనా ఎన్​డీసీని అసంపూర్ణమైనదిగా విమర్శించారు. వాతావరణ మార్పుల కట్టడిలో చైనా తన లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.

'అది పెద్ద పొరపాటే'

జిన్​పింగ్​తో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ కూడా కాప్​26 సదస్సుకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. ఈ సదస్సుకు హాజరు కాకుండా చైనా, రష్యా పెద్ద పొరపాటు చేశాయని తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

ఇవీ చూడండి:

'భారత వ్యతిరేక శక్తులను కట్టడి చేయాలి'

'చైనాలో భాగం కావటం తప్ప.. తైవాన్‌కు భవిష్యత్తు లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.