ETV Bharat / international

చైనాలో 100 కోట్ల మందికి టీకాలు? - చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్

ఏడాదిలోగా చైనా కనీసం 100కోట్ల మంది పౌరులకు కరోనా టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అతిపెద్ద సామూహిక వ్యాధి నివారణ కార్యక్రమ నిర్వహణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని భావిస్తోంది.

China aims to vaccinate 70-80 per cent of population by mid-2022
చైనాలో 100 కోట్ల మందికి టీకాలు?
author img

By

Published : Mar 14, 2021, 7:35 AM IST

దేశంలో 70-80 శాతం మంది జనాభాకు కరోనా టీకాలు ఇవ్వాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంవత్సరం చివరినాటికిగానీ, 2022వ సంవత్సరం ప్రథమార్థంలోగానీ ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం తీసుకుంది.

నాలుగు వ్యాక్సిన్లకు ఆమోదం లభించగా, వాటిని 90 నుంచి 100 కోట్ల మందికి ఇస్తామని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అధిపతి గావో ఫు చెప్పారు. సామూహిక వ్యాధి నిరోధక శక్తి సాధనలో చైనా ప్రపంచానికే ఆదర్శంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి వరకు 5.25 కోట్ల డోసులు ఇచ్చినట్టు తెలిపారు. దేశంలో మొత్తం 17 టీకాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని వివరించారు.

ఇదీ చదవండి: 'డ్రాగన్ దూకుడుకు క్వాడ్ కళ్లెం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.