కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హెబే రాష్ట్రంలోని 12 గ్రామాలకు చెందిన 20 వేల మందిని క్వారంటైన్‌కు తరలించింది.
సరైన పర్యవేక్షణ, వసతులు లేకపోవడం వల్ల చైనాలోని మారుమూల గ్రామాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సోమవారం 103 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో ఎక్కువ భాగం హెబే రాష్ట్రానికి చెందినవే ఉన్నాయి. ఐదు నెలల వ్యవధిలో రోజువారీ కేసులు మూడంకెల్లో నమోదు కావడం ఇదే తొలిసారి.
లక్షణాలు లేనివారితోనే కరోనా వ్యాప్తి అధికమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతంలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు అమలలోకి వస్తాయని తెలిపింది.
ఇదీ చదవండి: 'ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నా.. కాలం చైనావైపే!'