కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని ఖండాలనూ చుట్టేసింది. తాజాగా.. అంటార్కిటికాలోని రెండు మిలిటరీ స్థావరాల్లో ఉన్న 58 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు చిలీ అధికారులు వెల్లడించారు. వీరిలో 36మంది జెనరల్ బెర్నార్డో ఓ హిగ్గిన్స్ రిక్యెల్మే సైనిక స్థావరంలో ఉన్నట్టు పేర్కొంది. మరో 21మంది.. చిలీ నుంచి అంటార్కిటికాకు వెళ్లిన నేవీ ఓడ సర్జియెంట్ ఆల్డియాకు చెందిన వారని స్పష్టం చేసింది.
మరొక కేసు లాస్ ఎస్ట్రెల్లాస్ అనే గ్రామంలో వెలుగుచూసింది. లుటినెంట్ రోడాల్ఫ్ మార్ష్ మార్టిన్ వాయుదళ స్థావరంలో చిలీకి చెందిన పౌర సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు.
కరోనా కేసులపై తమకు అవగాహన ఉన్నట్టు అంటార్కిటికాలోని అమెరికా కార్యకలపాలను పర్యవేక్షిస్తున్న యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. కరోనా సోకిన వారితో అమెరికా బృందం కలవలేదని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : 'ట్రంప్ 2.0 ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు!'