పాకిస్థాన్ ఎదుర్కొంటున్న సవాళ్లు ఇంకా ముగియలేదని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ ఎయిర్ ఛీఫ్ మార్షల్ ముజహిద్ అన్వర్ ఖాన్ వైమానిక దళ అధికారులకు సూచించారు. పుల్వామా దాడి అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల మధ్య పాక్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ (ఎఫ్ఓబీ) సందర్శనలో భాగంగా ఖాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
" సవాళ్లు ఇంకా ముగియలేదు, నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. విరోధుల నుంచి ఎదురయ్యే ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలి"- ముజహిద్ అన్వర్ ఖాన్, పాకిస్థాన్ ఎయిర్ చీఫ్ మార్షల్