ETV Bharat / international

గల్వాన్​ ఎఫెక్ట్​: చైనాకు షాకిచ్చిన భారత్​!

చైనాకు మరో షాక్​ ఇచ్చింది భారత ప్రభుత్వం. బిహార్​లో ఓ భారీ ప్రాజెక్ట్​ నిర్మాణంలో చైనా కంపెనీల ప్రమయేమున్నందున ఆ టెండర్​ను రద్దు చేసింది. గల్వాన్​ లోయలో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నకున్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ​ దేశ ఉత్పత్తులు, వ్యాపారాలను బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

author img

By

Published : Jun 29, 2020, 10:49 AM IST

Centre cancels Bihar's mega bridge project involving Chinese firms
గాల్వన్​ ఎఫెక్ట్​: చైనాకు షాకిచ్చిన భారత్​!

బిహార్​లో గంగా నదిపై నిర్మిస్తోన్న మెగా ప్రాజెక్టులో... చైనా కంపెనీల ప్రమేయమున్న టెండర్​ను రద్దు చేసింది కేంద్రం.

గంగానదిపై మహాత్మా గాంధీ సేతుకు సమాంతరంగా వంతెన నిర్మించాలని 2019 డిసెంబర్​ 16న ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం నిర్ణయించింది. 5.6 కిలోమీటర్ల పొడవైన వంతెనతో పాటు, చిన్న చిన్న బ్రిడ్జులు, నాలుగు అండర్​పాస్​ రోడ్లు, ఐదు బస్​ స్టాండ్లు, 13 రోడ్​ జంక్షన్లు, 1.58 కి.మీల మేర రైల్వే బ్రిడ్జ్​లు ఈ ప్రాజెక్టులో భాగమే. ఈ బ్రిడ్జ్​ నిర్మాణం పూర్తయితే.. బిహార్​లోని పట్నా, శరణ్, వైశాలి జిల్లాలు లబ్ధి పొందుతాయి. ఈ నిర్మాణాన్ని 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం.

బ్రిడ్జ్​ను అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. ఇంతలోనే ఆ కాంట్రాక్టర్లలో చైనా కంపెనీల ప్రమేయముందని తెలిసి ఆ టెండర్​ను రద్దు చేసింది. దీంతో దాదాపు రూ. 2,900 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులోంచి చైనాను బహిష్కరించినట్లైంది.

"ఎంపిక చేసిన నలుగురిలో.. ఇద్దరు కాంట్రాక్టర్లు చైనీయులే. వారి ప్రమేయం ఉన్నందుకే టెండర్​ రద్దు చేశాం."

- బిహార్​ ప్రభుత్వాధికారి

జూన్​ 15న లద్ధాఖ్​ గల్వాన్​ లోయలో జరిగిన ఘర్షణలో చైనా బలగాలు 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నాయి. ఈ దాష్టీకంపై దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులను, వ్యాపార కార్యకలాపాలను రద్దు చేయాలని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం భారీ ప్రాజెక్ట్​లో చైనా ప్రమేయం ఉండకూడదని భావిస్తున్నట్లు స్పష్టమైంది.

ఇదీ చదవండి:జంతుప్రేమ: అక్కడ పశువులకూ ఉంది ఓ రోజు సెలవు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.