ETV Bharat / international

రూ.20కోట్లతో క్యాష్ వ్యాన్ డ్రైవర్​ పరార్! - చోరీ

బ్యాంకులో జమ చేయాల్సిన రూ.20కోట్ల నగదుతో పరారయ్యాడు ఓ వ్యాన్ డ్రైవర్. ఈ ఘటన పాకిస్థాన్​లోని కరాచీలో జరిగింది.

bank robbery
పాకిస్థాన్
author img

By

Published : Aug 12, 2021, 2:26 PM IST

పాకిస్థాన్​లో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. ఏకంగా రూ.20 కోట్ల నగదుతో ఉడాయించాడు ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన హుస్సేన్ షా అనే క్యాష్ వ్యాన్ డ్రైవర్.

ఎలా జరిగిందంటే..

ఆగస్టు 9న కరాచీలో ఈ ఘటన జరిగింది. చుంద్రీగర్​ రోడ్​లో ఉన్న స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ పాకిస్థాన్​లో నగదు జమ చేయడానికి డ్రైవర్ హుస్సేన్, వ్యాన్ సెక్యూరిటీ గార్డు వచ్చారు. ఈ సమయంలో నగదు బదిలీ కార్యక్రమాల కోసం గార్డు.. బ్యాంకులోనికి వెళ్లారు. అతను తిరిగివచ్చి చూసే సరికి వ్యాను కనిపించలేదు.

డ్రైవర్​కు ఫోన్​ చేయగా అత్యవసర పనిమీద వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు హుస్సేన్. కాసేపటికి మరోసారి ప్రయత్నించగా ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేసుకున్నాడు. దీంతో హుస్సేన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్యాంకుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో వ్యాను లభించిందని పోలీసులు తెలిపారు. అందులో నగదు సహా తుపాకులు, కెమెరా, డీవీఆర్​లు అపహరణకు గురయ్యాయని వెల్లడించారు. హుస్సేన్​ను 6నెలల కిందటే ఇంట్లో నుంచి గెంటేసినట్లు అతడి తండ్రి చెప్పారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఫ్లైట్​లో వచ్చి బైక్​ల చోరీ- ఓఎల్​ఎక్స్​లో దందా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.