ETV Bharat / international

కరోనా ప్రతాపం: రష్యాలో 4 వేలు దాటిన మరణాలు - CORONA VIRUS CASES

ప్రపంచంపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58,14,687 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం 3,47,979 మంది మరణించారు. రష్యాలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం పోసే పనిలో ఉంది అక్కడి యంత్రాంగం.

Caseloads rise Russia underlining reopening risks
కేసులు పెరుగుతున్నా.. ఆంక్షల సడలింపువైపే అడుగులు
author img

By

Published : May 28, 2020, 7:08 PM IST

లాక్​డౌన్​ ఎత్తివేసి ఆర్థిక వ్యవస్థను ఆదుకోవాలని చూస్తున్న దేశాలకు కరోనా సెగ పెరుగుతోంది. ఓవైపు కరోనాతో సహజీవనం కోసం అధికారులు ప్రణాళికలు రచిస్తుంటే.. వైరస్​ మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 58,14,687 కేసులు నమోదయ్యాయి. మొత్తం 3,47,979 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంకేసులుమృతులు
అమెరికా17,46,3111,02,116
బ్రెజిల్​4,14,66125,697
రష్యా3,79,0514,142
స్పెయిన్​2,83,84927,118
బ్రిటన్​2,67,24037,460
ఇటలీ2,31,13933,072
ఫ్రాన్స్​1,82,91328,596
జర్మనీ1,81,8958,533
టర్కీ1,59,7984,541

రష్యాలో...

రష్యాలో కరోనా ఉద్ధృతి పెరిగింది. కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య 4 వేలు దాటింది. అయినప్పటికీ రష్యావ్యాప్తంగా ఆంక్షల సడలింపునకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. డీలా పడ్డ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా గాడినపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ ఓటమికి చిహ్నంగా మే9న వార్షికోత్సవం జరగాల్సి ఉంది. కరోనా సంక్షోభం దృష్ట్యా ఇది వాయిదా పడింది. తాజాగా.. ఈ 75వ వార్షికోత్సవ వేడుకను జూన్​ 24న నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ తెలిపారు. వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

తన​ రాజకీయ అజెండాలోని అత్యంత కీలకమైన రాజ్యాంగ సవరణపైనా దృష్టిసారించారు పుతిన్. ఏప్రిల్​లో జరగాల్సిన ఓటింగ్​ను కరోనా వల్ల నిలిపివేశారు. ఇప్పుడు దీనిని తిరిగి పట్టాలపైకి తీసుకురావాలని చూస్తున్నారు.

అమెరికాలో...

అమెరికాలోని లాస్​వేగాస్​ కాసినోలు, వాల్ట్​ డీస్నీ వరల్డ్​లు తిరిగి తెరుచుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

బీచ్​లకు వెళ్లే ప్రజల సంఖ్య కూడా భారీగా పెరిగింది. వీరు ఎటువంటి నిబంధనలను పాటించడం లేదు. అందువల్ల.. కేసులు మళ్లీ పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • వైరస్​ను కట్టడి చేయడంలో విజయవంతమైన దక్షిణకొరియా.. ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే అనూహ్య రీతిలో బుధవారం 40, గురువారం 79 కేసులు నమోదయ్యాయి.
  • స్పెయిన్​, ఇటలీలో రెండు నెలల కనిష్ఠానికి కేసుల సంఖ్య పడిపోయింది. దీనితో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. చైనాలో గురువారం కేవలం రెండు కేసులే నమోదయ్యాయి.
  • న్యుజిల్యాండ్​లో వరుసగా ఆరో రోజు ఎలాంటి కొత్త కేసులు వెలుగుచూడలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.