ETV Bharat / international

అఫ్గాన్​లో కారు బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతి - Car bomb incident in Afghanistan latest news

అఫ్గానిస్థాన్​లో జరిగిన కారు బాంబు పేలుడులో ఓ చిన్నారి సహా ముగ్గురు పౌరులు మృతి చెందారు. మరో 24 మంది గాయపడ్డారు. దేశానికి ఉత్తరాన జరిగిన మరో రెండు ఘటనల్లో 10 మంది భద్రతా సిబ్బంది మరణించారు.

Car bomb in Afghanistan
అఫ్గాన్​లో కారు బాంబు
author img

By

Published : Apr 14, 2021, 2:23 AM IST

అఫ్గానిస్తాన్‌ పరాహ్​ రాష్ట్రంలో మంగళవారం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు. వీరిలో ఓ చిన్నారి ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. పోలీస్​ స్టేషన్​ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.

దేశానికి ఉత్తరాన బగ్లాన్​ రాష్ట్రంలో జరిగిన మరో రెండు ఘటనల్లో 10 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొందరు చొరబాటుదారులు దాడులు చేసినట్లు తెలిపారు. అయితే ఈ దాడులకు ఎవరూ కారణమన్నది ఇంకా తెలియరాలేదు.

ఖతార్​లో అఫ్గాన్​ ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య శాంతి చర్చలు జరుగుతుండటంతో పాటు.. అమెరికా సైనిక బృందాలను ఉపసంహరించుకుంటామని అధ్యక్షుడు జో బైడెన్​ తెలిపిన నేపథ్యంలో ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఇండో పసిఫిక్​పై భారత్​, ఫ్రాన్స్ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.