ETV Bharat / international

Afghan Taliban: పోలీస్​ చీఫ్​పై తాలిబన్ల తూటాల వర్షం! - తూటాల వర్షం

అఫ్గాన్​ను హస్తగతం చేసుకున్న తర్వాత.. దేశానికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించిన తాలిబన్లు(Afghan Taliban) తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. తమకు వ్యతిరేకంగా పోరాడిన వారిని చంపేస్తున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారిపై తూటాల వర్షం కురింపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Taliban
పోలీస్​ అధికారిపై తాలిబన్ల కాల్పులు
author img

By

Published : Aug 22, 2021, 12:21 PM IST

అఫ్గానిస్థాన్​ను(Afghanistan news) తమ వశం చేసుకున్న తాలిబన్లు (Afghan Taliban).. తమకు వ్యతిరేకంగా పోరాడిన వారిపై ప్రతీకార చర్యలు చేపడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా.. బహిరంగంగానే చంపేస్తున్నారు. తాజాగా తమకు లొంగిపోయిన ఓ పోలీసు అధికారిపై తూటాల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అధికారిని పొట్టనపెట్టుకున్న దృశ్యాలు అఫ్గాన్​లోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

హెరత్​ రాష్ట్రంలోని బాద్గీస్​ నగర పోలీసు చీఫ్​ హాజి ముల్లా అచక్​జాయ్​ తాలిబన్లకు లొంగిపోయారు. ఆయన కళ్లకు తాలిబన్లు గంతలు కట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి.. ఆ తర్వాత పలు రౌండ్ల కాల్పులు జరిపినట్లు న్యూయార్క్​ పోస్ట్​ వెల్లడించింది.

'ఇది వారి ప్రజా క్షమాభిక్ష..'

ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసిన అమెరికా జర్నలిస్ట్​ ఒకరు ఇది 'ఇదీ వారి ప్రజా క్షమాభిక్ష' అని రాసుకొచ్చారు. కాబుల్​ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశ ప్రజలకు క్షమాభిక్ష పెడుతున్నామని, మహిళల హక్కులను గౌరవిస్తామని తాలిబన్లు ప్రకటించిన వీడియోను జత చేశారు.

ఈ వీడియోను ముష్కర ముఠా సైతం తాలిబన్​కు సంబంధించిన నెట్​వర్క్​ ద్వారా విడుదల చేసింది. అధికారి మరణాన్ని స్థానిక పోలీసులు, అధికారులు ధ్రువీకరించినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.