ETV Bharat / international

భారత్​లోని 2 కీలక ప్రాజెక్టులకు 'ఎన్​డీబీ' రుణసాయం!

భారత్​లోని రెండు కీలక రైల్వే ప్రాజెక్టులకు భారీ సాయం అందిస్తోంది బ్రిక్స్​ దేశాల అభివృద్ధి బ్యాంక్ ​(ఎన్​డీబీ). ముంబయి మెట్రో, దిల్లీ-మేరఠ్​ ఆర్​ఆర్​టీఎస్​ ప్రాజెక్టులకు కలిపి మొత్తం 741 మిలియన్​ డాలర్ల మేర రుణాలు అందించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

BRICS' NDB approves loans for Mumbai Metro,
బ్రిక్స్​ దేశాల అభివృద్ధి బ్యాంక్
author img

By

Published : Sep 30, 2020, 6:21 PM IST

భారత్​లోని రెండు కీలక​ ప్రాజెక్టుల కోసం రుణాలు మంజూరు ప్రతిపాదనకు ఆమోదించింది బ్రిక్స్​ దేశాల అభివృద్ధి బ్యాంకు​(ఎన్​డీబీ). ముంబయి మెట్రోకు 241 మిలియన్​ డాలర్లు, దిల్లీ-గాజియాబాద్​-మేరఠ్​ మధ్య ప్రాంతీయ రాపిడ్​ ట్రాన్సిట్​ సిస్టమ్​(ఆర్​ఆర్​టీఎస్​) ప్రాజెక్టుకు 500 మిలియన్​ డాలర్లు రుణాలు ఇవ్వనుంది. ఈ రుణాలకు ఎన్​డీబీ బోర్డు అనుమతులు ఇచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది.

ముంబయి మెట్రో రైల్​-2 ప్రాజెక్టు కోసం అందించే 241 మిలియన్​ డాలర్లను.. నగరంలో 14.47 కిలోమీటర్ల మెట్రో రైల్​ లైన్​-6 నిర్మాణానికి వినియోగించనున్నారు. ఈ లైన్​ తూర్పు-పశ్చిమ ప్రాంతాలను కలపనుంది. ముంబయి ప్రజారవాణాలో ఈ లైన్​ కీలక పాత్ర పోషించనుంది. ముంబయి మెట్రో ప్రాజెక్టులో సుమారు 58 కిలోమీటర్ల ( లైన్​ 2, 7) మేర నిర్మాణం కోసం 2018, నవంబర్​లో ఆర్థిక సాయం అందించింది ఎన్​డీబీ.

దేశ రాజధాని దిల్లీ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​, మేరఠ్​ను కలిపే రాపిడ్​ రైల్​ కారిడార్​ నిర్మాణానికి ఎన్​డీబీ 500 మిలియన్​ డాలర్లను అందిస్తోంది. ఈ ఆర్​ఆర్​టీఎస్​ ప్రాజెక్టు సుమారు 82.15 కిలోమీటర్లు పొడవు, 25 స్టేషన్లతో రూపొందనుంది. గంటకు 180 కిలోమీటర్ల మేర పరుగులు పెట్టే రైలుకు తగిన విధంగా ఈ ట్రాక్​ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా దిల్లీ నుంచి మేరఠ్​కు చేరుకునే ప్రయాణ సమయం 60 నిమిషాల మేర తగ్గుతుంది.

ఇదీ చూడండి: కరోనాపై పోరులో భారత్​కు ఎన్​డీబీ భారీ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.