ETV Bharat / international

భారత్​తో చర్చలనే కోరుకుంటున్నాం: నేపాల్​ - భారత్ నేపాల్ వివాదం

భారత్​తో సరిహద్దు వివాదంపై నేపాల్​ వెనకడుగు వేసింది. వివాదాలకు సంబంధించి భారత్​తో చర్చలకోసం ఎదురుచూస్తున్నామని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలి స్పష్టం చేశారు.

Border dispute
భారత్​తో చర్చలనే కోరుకుంటున్నాం
author img

By

Published : Jun 9, 2020, 8:12 PM IST

సరిహద్దు సమస్యలకు సంబంధించి నేపాల్​ వెనక్కు తగ్గింది. కొన్ని ప్రాంతాలపై నెలకొన్న వివాదాల పరిష్కారాలపై చర్చలకు సంబంధించి భారత్​ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని నేపాల్​ విదేశాంగ మంత్రి ప్రదీప్​ గ్యావలీ స్పష్టం చేశారు.

ఓ ఆంగ్ల వార్తాసంస్థతో మాట్లాడిన ప్రదీప్​.. గతేడాది నవంబర్​, డిసెంబర్​తోపాటు మేలోనూ చర్చలకు భారత్​ను ఆహ్వానించినట్లు తెలిపారు.

"మేం సమయం ఇచ్చాం. ఇప్పటికీ ఈ సమస్యలపై చర్చల ద్వారా పరిష్కించుకోవాలని నేపాల్ కోరుకుంటోంది. భారత్​ స్పందన కోసం మేం ఎదురుచూస్తున్నాం. సాధారణ చర్చలతో ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నస్తున్నాం."

- ప్రదీప్ గ్వావలి, నేపాల్​ విదేశాంగ మంత్రి

లిపులేఖ్​ రోడ్డుతో వివాదం ప్రారంభం..

భారత్​ టిబెట్​ మధ్య దూరాన్ని తగ్గించేందుకు లిపులేఖ్​ కనుమ వరకు నిర్మించిన 80 కిలోమీటర్ల రోడ్డును ఇటీవల రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రారంభించారు. హిమాలయాల్లోని మూడు దేశాల సరిహద్దు ప్రాంతాలను కలిపే ఈ ప్రాంతంలో రహదారి ప్రారంభించటం వల్ల భారత్​, నేపాల్​ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.

ఈ నిర్మాణాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్​ ఆక్రమణకు పాల్పడుతోందని వాదించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో కలుపుతూ నేపాల్​ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ జాతీయ పటాన్ని విడుదల చేశారు.

ఇప్పటివరకు వలస పాలనలో లేని నేపాల్​ 1816లో సుగౌలీ ఒప్పందం ప్రకారం లింపియాధురా, కాలపానీ, లిపులేఖ్​ ప్రాంతాలు తమ భూభాగాలని వాదిస్తోంది. అయినప్పటికీ చైనాతో యుద్ధం తర్వాత 1962 నుంచి ఈ ప్రాంతాలు భారత బలగాల అధీనంలోనే ఉన్నాయి.

కరోనాతో ఆటంకం?

దేశంలో కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చేంత వరకు నేపాల్​తో చర్చలకు భారత్​ సిద్ధంగా లేదని సమాచారం. ఈ విషయంపై స్పందించిన ప్రదీప్​.. ఒకవేళ చర్చలకు కరోనా ఆటంకం ఏర్పరిస్తే రహదారి ప్రారంభానికి ఎందుకు అడ్డుపడలేదని ప్రశ్నించారు.

"ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక చర్చలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే ఈ చర్చలు నామమాత్రంగా కాకుండా పరిష్కారం లభించే విధంగా ఉండాలి. పరస్పర ప్రయోజనాలను కాపాడే విధంగా ఇరు దేశాలు మధ్య వాతావరణం నెలకొనాలి. ఫలితంగా దక్షిణాసియా ప్రాంతంలో భారత్​, నేపాల్ మైత్రి కొనసాగాలి."

- ప్రదీప్ గ్వావలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.