ఇథియోపియాలో 'బోయింగ్ 737' విమానం కూలిన నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. ఈ విమాన సర్వీసులను నిలిపేస్తున్నట్లు డ్రాగన్ పౌరవిమానయాన శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తాయని నమ్మకం కలిగితేనే ఈ విమానాలను వినియోగిస్తామని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి చైనా విమానయానశాఖ 76 'బోయింగ్ 737 మ్యాక్స్' విమానాలను కొనుగోలు చేసింది. మరో 104 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఇథియోపియాలో 'బోయింగ్ 737' విమానం ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సిబ్బందితో సహా 150 మంది మృత్యువాత పడ్డారు. తక్షణమే చైనా ఈ విమాన సర్వీసులను నిలిపేసింది.
ఇదీ చూడండి :ఇథియోపియా విమాన ప్రమాదంలో భారతీయులు మృతి!