ETV Bharat / international

పాకిస్థాన్​లో పేలుడు- ఇద్దరు పోలీసులు మృతి! - పాకిస్థాన్​లో బాంబు పేలుడు

blast in pakistan
పాకిస్థాన్​లో పేలుడు
author img

By

Published : Aug 8, 2021, 9:50 PM IST

Updated : Aug 8, 2021, 10:55 PM IST

21:46 August 08

పాకిస్థాన్​లో పేలుడు- ఇద్దరు మృతి

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్ర రాజధాని క్వెట్టాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించగా.. మరో 12 మంది గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు తెలిపారు.  

మోటార్​ బైకులో అమర్చి ఈ బాంబును పేల్చినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బలూచిస్థాన్​ ప్రభుత్వ అధికార ప్రతినిధి లియాక్వాట్​ షావాని తెలిపారు. క్వెట్టాలో సెరెనా హోటల్​ సమీపంలోని తంజీమ్ స్క్వేర్​ వద్ద పోలీసుల వాహనమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగిందని చెప్పారు.  

పేలుడు అనంతరం.. ఘటనా స్థలికి భధ్రతా బలగాలు చేరుకున్నాయి. నిందితులను పట్టుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. గాయపడ్డవారిని సివిల్ ఆస్పత్రికి తరలించామని సీనియర్​ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పేలుడు కారణంగా సమీపంలోని భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయని చెప్పారు.  

అయితే..  పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ ఘటనను బలూచిస్థాన్​ ముఖ్యమంత్రి జామ్​ కమల్​ ఖాన్​ ఖండించారు. రాష్ట్రంలో అశాంతిని రగల్చాలనే ఉగ్రవాద కార్యకలాపాలను సాగనివ్వబోమని తెలిపారు.

Last Updated : Aug 8, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.