ETV Bharat / international

చైనా ప్రభుత్వ కార్యాలయంలో భారీ పేలుడు- 16మంది మృతి​

Blast in china office: చైనాలో ఓ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందగా.. మరో 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. చాంగ్​కింగ్​ నగరంలో జరిగింది ఈ ఘటన.

Blast in China
Blast in China
author img

By

Published : Jan 8, 2022, 9:37 AM IST

Blast in china office: చైనాలోని ఓ ప్రభుత్వ కార్యాలయ కెఫ్టెరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

చాంకింగ్​ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. కెఫ్టెరియా శిథిలాలు తొలగించి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

గ్యాస్​ లీక్​ కావడమే ఈ పేలుడు కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 40 ఏళ్లుగా ప్రేమ.. ఇప్పుడు పెళ్లి.. వరుడు ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.