ETV Bharat / international

ఆసియా ప్రజలకు బైడెన్​.. నూతన సంవత్సర శుభాకాంక్షలు - ఆసియావాసులకు బైడెన్ ఉగాది శుభాకాంక్షలు!

దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రజలకు వైశాఖీ, నవరాత్రి, సోంగ్​క్రాన్​, నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ప్రజలంతా సంతోషంగా ఈ పండుగలను జరుపుకోవాలని ట్వీట్​ చేశారు.

joe biden
ఆసియా ప్రజలకు బైడెన్.. వైశాఖి, నవరాత్రి శుభాకాంక్షలు
author img

By

Published : Apr 14, 2021, 8:09 AM IST

దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రజలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. వైశాఖీ, నవరాత్రి, సోంగ్​క్రాన్​, నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ప్రారంభం సందర్భంగా.. వివిధ పేర్లతో పిలుచుకునే ఈ పండుగలను అందరూ సంతోషంగాా జరుపుకోవాలని కోరారు బైడెన్​.

"వైశాఖీ, నవరాత్రి, సోంగ్​క్రాన్​, నూతన సంవత్సరాది.. పండుగలను జరుపుకుంటోన్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రజలకు జిల్​, నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బెంగాలీ, కంబోడియన్​, లావో, మయన్మారీ, నేపాలీ, సింహళీ, తమిళ్​, థాయ్​, విషు నూతన సంవత్సర శుభాకాంక్షలు."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

వసంత రుతువు ప్రారంభానికి చిహ్నంగా.. వివిధ ప్రాంతాల్లో, వివిధ పేర్లతో ప్రజలు ఈ నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు. మనదేశంలో కర్ణాటకలో ఉగాది అని, బంగాల్​లో నబా బర్షా అని పిలుస్తారు. హిందువులు 9 రోజులపాటు చైత్ర నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్​ 13 నుంచి ఏప్రిల్​ 22 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 9/11 నాటికి అఫ్గాన్​లో అమెరికా దళాల ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.