ETV Bharat / international

హత్య కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష - bangladesh students death sentence

bangladesh students death sentence: తోటి విద్యార్థిని కిరాతకంగా హత్యచేసిన కేసులో 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించింది బంగ్లాదేశ్ ట్రయల్​ కోర్టు. మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది.

bangladesh students death sentence
తీర్పు
author img

By

Published : Dec 9, 2021, 6:56 AM IST

bangladesh court news: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్​బుక్​ పోస్ట్ పెట్టిన తోటి విద్యార్థిని కిరాతకంగా హత్యచేసిన కేసులో బంగ్లాదేశ్ ట్రయల్​​ కోర్టు 20 మంది విద్యార్థులకు మరణశిక్ష విధించింది. మరో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ శిక్షను విధించినట్లు పేర్కొంది.

bangladesh students death sentence

దోషులు బంగ్లాదేశ్​ యూనివర్శిటీ ఆఫ్ ఇంజనీరింగ్​ అండ్ టెక్నాలజీకి(బీయూఈటీ) చెందిన విద్యార్థులు. అధికారంలో ఉన్న అవామీ లీగ్​ స్టుడెంట్​ ఫ్రంట్​ బంగ్లాదేశ్ ఛత్ర లీగ్​ (బీసీఎల్)కు చెందిన కార్యకర్తలు. 2019లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫేస్​బుక్​ పోస్ట్ పెట్టిన సెకండ్ ఇయర్ విద్యార్థి అబ్రార్​ ఫహాద్(21)ను జమాతే-ఈ-ఇస్లామీకి చెందిన స్టుడెంట్ ఫ్రంట్​ కార్యకర్తగా అనుమానించి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన వెంటనే నిందితులైన కార్యకర్తలకు సభ్యత్వాన్ని రద్దు చేసింది బీసీఎల్​.

హత్యకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బయటికి రావడం వల్ల బంగ్లాదేశ్​ అంతటా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ హత్యపై ఐక్యరాజ్య సమితి కూడా ప్రత్యేక స్వతంత్ర్య దర్యాప్తు జరిపించనున్నట్లు అప్పట్లో తెలిపింది. దీంతో ఈ హత్య అంతర్జాతీయ అంశంగా మారిపోయింది. ప్రస్తుత తీర్పు పట్ల బాధిత కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:కుమార్తె పుట్టినరోజునే విషాదం- దొంగల కాల్పుల్లో తండ్రి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.