బంగ్లాదేశ్‌లో వరదలు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాల ధాటికి పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రధాన నదులు జమునా, తీస్తాలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
వరదలకు గైభాంద జిల్లాలో సహాయం అందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీసం నిలువనీడ లేక అల్లాడుతున్నారు. వరదల్లో చిక్కుకుని... లోతట్టు ప్రాంతాల నుంచి బయటపడేందుకు సరిపడా పడవలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వరదల ధాటికి బంగ్లాదేశ్‌లో 66 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని రెడ్‌క్రాస్ అంచనా వేసింది. 40 లక్షల మంది ప్రజలు నిత్యావసరాలు, ఆహారం లేక, భద్రత కరవై ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది. వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.
జమునా, తీస్తా నదులకు తోడు భారత భూభాగం నుంచి కూడా వరద నీరు వస్తుండటం కారణంగా వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.
బంగ్లాదేశ్‌లోని జమునా తీస్తా ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటం కారణంగా వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది.
ఇదీ చూడండి: సోమవారానికి కర్నాటకీయం వాయిదా!