ETV Bharat / international

బంగబంధు హత్యకేసు దోషికి 45 ఏళ్ల తర్వాత ఉరిశిక్ష

author img

By

Published : Apr 12, 2020, 11:10 AM IST

బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య సమరయోధుడు ముజిబుర్​ హత్య కేసులో మాజీ సైనికాధికారిని ఉరి తీశారు. ఈ ఘటన జరిగిన సుమారు 45ఏళ్ల తర్వాత దోషికి మరణశిక్ష అమలైంది.

Bangladesh executes ex-Army officer for assassinating Bangabandhu
బంగబంధు హత్యకేసులో దోషికి 45 ఏళ్ల తర్వాత ఉరిశిక్ష

బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య సమరయోధుడు షేక్​ ముజిబుర్​ రెహ్మాన్​ను 1975లో​ హత్య చేసిన కేసులో ఆ దేశ మాజీ సైనికాధికారికి ఉరిశిక్ష విధించారు. ఈ ఘటన జరిగిన సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత దేశ రాజధాని ఢాకా సెంట్రల్​ జైలులో అబ్దుల్​ మాజెద్​ను ఉరి తీశారు.

ఉరిశిక్ష విధించే ముందు మాజెద్​ క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి అబ్దుల్​ హమీద్​ తిరస్కరించారు. 25ఏళ్లుగా పరారీలో ఉన్న మాజెద్​ను మంగళవారం ఢాకాలో పోలీసులు అరెస్టు చేశారు. ఇన్నేళ్లు భారత్​లోని కోల్​కతాలో తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు.

ముజిబుర్ రెహ్మాన్​ సహా ఆయన కుటుంబ సభ్యులను 1975లో హత్య చేసిన కేసులో 12 సైనిక అధికారులకు మరణశిక్ష పడింది. వారిలో ఐదుగురికి 2010లో ఉరిశిక్ష అమలు చేశారు. పరారీలో ఉంటూ పాకిస్థాన్​ తదితర దేశాల్లో తలదాచుకుంటున్న వారిపై ఇంటర్​పోల్​ రెడ్​ అలర్ట్​ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.