ETV Bharat / international

'ఆస్ట్రేలియన్లపై నిషేధం కఠినమే.. కానీ తప్పదు' - ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్​

భారత్​ నుంచి తిరిగవచ్చే ఆస్ట్రేలియన్లపై ఆంక్షలు విధించడాన్ని సమర్థించుకన్నారు ఆ దేశ ప్రధాని స్కాట్​ మారిసన్​. ఆస్ట్రేలియన్లు సురక్షితంగా ఉండేందుకు ఇది తప్పదని స్పష్టం చేశారు.

Autralian PM defends ban on citizens returning from India; says its in best intrests
'ఆస్ట్రేలియన్లపై నిషేధం.. కఠినమే, కానీ తప్పదు'
author img

By

Published : May 3, 2021, 1:45 PM IST

భారత్​ నుంచి తిరిగి రావాలునుకునే ఆస్ట్రేలియన్లపై విధించిన నిషేధాన్ని ఆ దేశ ప్రధాని స్కాట్​ మారిసన్​ సమర్థించుకున్నారు. దేశ ప్రజల హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

భారత్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. 14 రోజుల పాటు భారత్​లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటే.. జైలు శిక్షతో పాటు భారీ స్థాయిలో జరిమానా విధించనున్నట్టు పేర్కొంది.

"ఆస్ట్రేలియాలో కరోనా మూడో దశను నియంత్రించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో దేశంలోని క్వారంటైన్​ వ్యవస్థ బలంగా ఉంటుంది. ముఖ్య వైద్య అధికారి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఆస్ట్రేలియన్లను సురక్షితంగా ఉంచేందుకు ఈ నిషేధం తప్పదు."

--- స్కాట్​ మారిసన్​, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి.

ఈ ఏర్పాట్లు తాత్కాలికమేనని, పరిస్థితి చక్కబడే వరకు అమల్లో ఉంటాయని మారిసన్​ పేర్కొన్నారు.

నేపాల్​ పరిస్థితి...

నేపాల్​లో కరోనా రెండో దశ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకు దేశీయ, విదేశీ విమానాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ఇదీ చూడండి:- భారత్​ విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.