బొగ్గుగనుల్లో ప్రమాదాలను నివారించేందుకు సరికొత్త సాంకేతికతను ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ అధికారులు అభివృద్ధి చేశారు. హావర్ మ్యాప్ టెక్నాలజీ ద్వారా పనిచేసేలా అటానమస్ డ్రోన్లను సిద్ధం చేశారు. లేజర్ సిగ్నళ్ల ఆధారంగా భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ డ్రోన్లు సమర్థంగా, స్వతంత్రంగా పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారా డ్రోన్లు జీపీఎస్ మీద ఆధారపడే అవసరం తప్పనుంది.
హావర్ మ్యాప్ టెక్నాలజీని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అభివృద్ధి చేసింది.
స్వతంత్రంగా విధులు..!
భూగర్భ ప్రాంతాల్లో డ్రోన్లు సురక్షితంగా పనిచేసేందుకు హావర్ మ్యాప్ టెక్నాలజీ ఉపకరిస్తుందని అక్కడి ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోకి కార్మికులను పంపే బదులు అటానమస్ డ్రోన్లను పంపి సమాచారాన్ని సేకరించవచ్చని వివరిస్తున్నారు. అటానమస్ డ్రోన్లు.. ఎలాంటి పర్యవేక్షణ అవసరం లేకుండానే క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా స్వతంత్రంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు. దీనివల్ల ఉపాధి కోల్పోతామనే భయం అక్కర్లేదని, ప్రమాదకర పరిస్థితుల నుంచి వారికి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి: